S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/29/2016 - 15:32

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా తొగాపూర్‌ పంచాయతీ పందిరి హన్మన్‌పల్లిలో శుక్రవారం విద్యుత్‌ కంచె తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించిన సంఘటన జరిగింది. తుడుము వెంకటయ్య తన జొన్న పంట అడవి పందుల బారిన పడకుండా వేసిన విద్యుత్‌ కంచె తగిలి తాను పెంచుకుంటున్న కుక్క మరణించింది. కుక్కని చూసేందుకు వెళ్లిన వెంకటయ్య అనుకోకుండా తీగను పట్టుకొని విద్యుదాఘాతానికి గురై మరణించాడు.

07/29/2016 - 14:38

హైదరాబాద్ : మెదక్ జిల్లా సరిహద్దుకు ప్రతిపక్ష నేతలు వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు... మెదక్ జిల్లా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలకు ప్రతిపక్ష నేతలు వెళ్తే వాస్తవాలు బయటపడతాయని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, జానారెడ్డి, షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి తిప్పడం దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

07/29/2016 - 14:35

వరంగల్‌ : ఎంసెట్-2 పేపర్ లీకేజీపై వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్ కర్నూల్‌కు చెందిన అవినాష్ అనే విద్యార్థి ఇంటికి సీఐడీ అధికారులు రాగా తాళం వేసి ఉండడాన్ని గుర్తించారు. వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లికి చెందిన 11 మంది విద్యార్థులకు ఎంసెట్‌-2 పేపర్ అందినట్టు సీఐడీ అధికారులు నిర్ధారించారు.

07/29/2016 - 14:33

హైదరాబాద్‌: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీపై సీఐడీ నివేదిక సమర్పించనుంది. డీజీపీ అనురాగ్‌శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. నివేదికను సమీక్షించిన తర్వాత ఎంసెట్‌-2 రద్దుపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

07/29/2016 - 12:10

హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాలను శుక్రవారం ముట్టడించారు. పేపర్ లీక్‌కు సంబంధించి మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్త్ఫ్ చేయాలని, లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

07/29/2016 - 12:09

హైదరాబాద్: పేపర్ లీక్ అయిందన్న సాకుతో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని వెంటనే అక్కడి నుంచి పంపివేశారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు విద్యార్థులు బయలుదేరగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

07/29/2016 - 12:09

హైదరాబాద్: ప్రజల కోసం పనిచేసే ఇంజనీర్లకు తాము అండగా ఉంటామని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల ముగ్గురు ఇంజనీర్లపై దాడి జరగడం సహించరాని విషయమన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

07/29/2016 - 12:06

హైదరాబాద్: ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నగరంలోని కాచిగూడ వద్ద జరిగింది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, ఈ ఘటనకు దారితీసిన కారణాల గురించి దర్యాప్తు ప్రారంభించారు.

07/29/2016 - 12:06

మెదక్: లాఠీచార్జిలో గాయపడిన మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీని పోలీసులు ఒంటిమామిడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతులను పరామర్శించేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

07/29/2016 - 11:52

హైదరాబాద్ : ఆగష్టు చివరి వారంలో ఎంసెట్-3 పరీక్ష నిర్వహించి, సెప్టెంబర్ తొలి వారంలో ఫలితాలు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఎంసెట్-2ను రద్దు చేస్తే మళ్లీ ప్రకటన చేయాల్సిన అవసరం లేదని, ఎంసెట్-1ను కూడా రద్దు చేస్తే అప్పుడు ప్రకటన చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్నతవిద్యామండలి, జేఎన్‌టీయూ ఎంసెట్-3 తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిసింది.

Pages