S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/24/2016 - 03:39

హైదరాబాద్, జూలై 23: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని వెనుకబడిన తరగతుల కమిషనర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నెల 27 నుండి ఆగస్టు 3 వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు బిసి స్టడీసర్కిల్ వెబ్‌సైట్‌లో ఉంటాయని వెల్లడించారు.

07/24/2016 - 03:38

హైదరాబాద్, జూలై 23: పార్లమెంటులో ఆమోదం పొందబోతున్న బాల కార్మిక చట్టాన్ని మరింత కఠినతరం చేశామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రాజ్యసభలో ఆమోదం పొందిన బాల కార్మిక సవరణ బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో వ్యక్తం చేశారు.

07/24/2016 - 03:37

హైదరాబాద్, జూలై 23: పత్తి పంట దెబ్బ తిన్న రైతులకు నెల రోజుల్లోగా నష్టపరిహారం ఇప్పించాలని హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి శనివారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నాణ్యత లేని పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు సంబంధిత కంపెనీ నుంచి పరిహారం ఇప్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని న్యాయమూర్తి పేర్కొన్నారు.

07/24/2016 - 03:36

హైదరాబాద్, జూలై 23: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన 24వ తేదీ ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. జస్టిస్ కొండా మాధవరెడ్డిపై స్మారకోపన్యాసం ఇస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన లా, ఎకనామీ ఈఅంశాలపై ప్రసంగిస్తారు.

07/24/2016 - 03:35

హైదరాబాద్, జూలై 23 : తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కింద శనివారం వరకు 14 కోట్ల మొక్కలను నాటామని మంత్రి జోగురామన్న తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ, హరితహారం కార్యక్రమం యుద్ధప్రాతిపదికపై కొనసాగుతోందని, ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా అంటే 2.27 కోట్ల మొక్కలు నాటినట్టు వివరించారు.

07/24/2016 - 03:34

హైదరాబాద్, జూలై 23: తెలంగాణలోని అన్ని జిల్లాల, మండల స్థాయి పార్టీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ నాయకులకు సూచించారు. శనివారం టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో, ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశానికి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/24/2016 - 03:34

హైదరాబాద్, జూలై 23 : తెలంగాణ రాష్ట్రంలో దవాఖానాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఔషధ సేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎంఎస్‌ఐడిసి) పనితీరును శనివారం ఆయన సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

07/24/2016 - 03:30

కరీంనగర్, జూలై 23: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు భద్రత కరువైంది. శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని పిల్లల వార్డులో ఒక్కసారిగా భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి, ఆమె తల్లిదండ్రులతోపాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో జరిగిన ఈ ఘటన రోగులను భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/24/2016 - 03:30

ధర్మపురి, జూలై 23: గోదావరి పరివాహక ఎగువన కురిసిన వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు నుండి నీటిని నిరంతరంగా గోదావరిలోకి వదులుతుండడంతో శనివారం నది నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది.

07/24/2016 - 03:29

ఆర్మూర్, జూలై 23: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ నెల 14వ తేదిన మృతి చెందిన సుప్రజ(31), నాలుగు నెలల వయసు గల ఆమె కుమారుడు శ్రీహాన్‌ల మృతదేహాలు శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చేరుకున్నాయి. అయితే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. మెల్‌బోర్న్‌లో సుప్రజ, కుమారుడు శ్రీహాన్‌లు ప్రమాదవశాత్తు వారు నివసించే భవనంపై నుంచి కింద పడి మృతి చెందారు,.

Pages