S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/24/2016 - 02:15

హైదరాబాద్/ గోదావరిఖని, జులై 23: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 7న నగరానికి రానున్నారు. ఒకరోజు పర్యటనలో ప్రధాని మోదీ పలు అధికారిక కార్యక్రమాలతో పాటు బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొంటారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరానప్పటికీ, పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయానికి పర్యటన తేదీని ఖరారు చేస్తూ పిఎంవో సమాచారం అందించింది.

07/23/2016 - 18:10

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించిన 250 మంది వాహనదారులకు శనివారం గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో ఏసీపీ జైపాల్‌ మాట్లాడుతూ, తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని, విద్యార్థులు అయితే కాలేజ్ల నుంచి పంపించేలా సంబంధిత అధికారులకు లేఖలు రాస్తామని అన్నారు.

07/23/2016 - 18:03

హైదరాబాద్: ఆగస్టు 7న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వస్తారని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ తెలిపారు. ప్రధాని పర్యటన పార్టీకి ఉపయోగపడేలా మలుచుకుంటామన్నారు. మోదీ పర్యటనతో ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజన సమస్యలకు పరిష్కారమవడం ఖాయమని ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు
బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ పాల్గొననున్నారని ఆయన చెప్పారు.

07/23/2016 - 17:45

వరంగల్‌: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌కు బాలకార్మికులను తరలిస్తుండగా 50 మంది బాలకార్మికులను వరంగల్‌ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. బాలలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07/23/2016 - 17:38

వరంగల్‌: మామ్నూరులో పశువైద్య కళాశాల ఏర్పాటుకు, 87 మంది బోధనా సిబ్బంది, 205 మంది బోధనేతర సిబ్బందిని మంజూరుకు ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

07/23/2016 - 16:48

కరీంనగర్: కరీంనగర్ జిల్లా రాయపట్నం వద్ద శనివారం గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. పాతవంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనపై రాకపోకలను అధికారులు పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిషేధం విధించారు.

07/23/2016 - 16:47

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు అనుమానితులను శనివారం నాడు ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. వీరు నగరంలోని టోలీచౌకీ ప్రాంతానికి చెందినవారని, పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.

07/23/2016 - 15:18

మెదక్: గత ఏడాది నాటిన మొక్కలు ఎక్కడ ఉన్నాయంటూ మంత్రి హరీష్‌రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్కల్ మండలం సింగూరు జలాశయం ఇన్‌టేక్ వెల్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. పంప్‌హౌస్ వద్ద మొక్కలు నాటారు. గత ఏడాది ఇక్కడ నాటిన మొక్కలు ఏమై పోయాయని ఆయన ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. అధికారుల తీరు సరిగా లేదని మంత్రి ఆగ్రహం ప్రకటించారు.

07/23/2016 - 15:17

నల్గొండ: తరగతులకు గైర్హాజరై సినిమాకు వెళ్లిన ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా చేయి చేసుకున్నాడు. ఈ ఘటన తుర్కపల్లి ఆదర్శ పాఠశాలలో శనివారం జరిగింది. ఉపాధ్యాయుడి దాడిలో గాయపడిన విద్యార్థి భానును ఆసుపత్రిలో చేర్పించారు. అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

07/23/2016 - 14:24

హైదరాబాద్‌: ఐసిస్‌ కుట్రకేసులో నిందితుడు అతవుల్లా రెహమాన్‌ను శనివారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ ముగియడంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 26 వరకు రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

Pages