S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/23/2016 - 12:34

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయిస్తామని నగరంలో పలువురిని మోసగించిన నలుగురు మాయగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు దాదాపు 30 లక్షల రూపాయలను వసూలు చేసి కొంతమందిని వంచించారు.

07/23/2016 - 12:08

హైదరబాద్: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం ఉదయం ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ ప్రాంత నాయకులతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఏర్పాటైన పది కమిటీల పనితీరు, సంస్థాగత వ్యవహారాలను ఆయన సమీక్షిస్తున్నారు.

07/23/2016 - 11:37

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్ట వద్ద శనివారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఢీకొని టిప్పర్‌ లారీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడింది. వంతెన కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

07/23/2016 - 11:32

మహబూబ్‌నగర్ : వరద ప్రభావం తగ్గడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కూడా రెండు యూనిట్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 20430 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు అవుతోంది.గత రాత్రి భీమానది నుంచి వస్తున్న వరద ఒక్కసారిగా 20వేల క్యూసెక్కుల నుంచి 60వేల క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు ఏడు గేట్లు మీటర్ మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు.

07/23/2016 - 07:05

హైదరాబాద్, జూలై 22: తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలాలనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రారంభోత్సవాలు చేస్తున్నదని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించేందుకు వెళ్ళారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఉదహరించారు.

07/23/2016 - 07:03

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు జి. పద్మజారెడ్డి, ప్రధాన కార్యదర్శులు కె. రవళి, జి. ఉమారాణి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును డిమాండ్ చేశారు.

07/23/2016 - 07:02

హైదరాబాద్, జూలై 22: వ్యాపమ్‌ను తలదనే్నలా ఎంసెట్-2 కుంభకోణం జరిగిందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని టి.పిసిసి అధికార ప్రతినిధి కొనగాలి మహేశ్ డిమాండ్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రమేయం ఉందని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.

07/23/2016 - 07:01

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణానది వరద ఒక్కసారిగా పెరిగింది. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదికి మళ్లీ జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగి నిండుకుం డలా మారింది.

07/23/2016 - 06:59

హైదరాబాద్, జూలై 22: కవి డాక్టర్ దశరథి పద్యాల్లోని ప్రతి అక్షరం ఓ నిప్పురవ్వ అని అభివర్ణించారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. దాశరథి కృష్ణమాచార్య 92వ జయంతి ఉత్సవం శుక్రవారం ఉదయం రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహమూద్ అలీ మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అంటూ గొంతెత్తిచాటిన మహానీయుడు దాశరథి అని గుర్తుచేశారు.

07/23/2016 - 06:39

హైదరాబాద్, జూలై 22: హరితహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏ మేరకు భాగస్వాములు అయ్యారో తెలుసుకునేందుకు సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు జరుపుతానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుస్పష్టం చేశారు.

Pages