S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/23/2016 - 06:36

హైదరాబాద్, జూలై 22: ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం ఉగ్రవాద సానుభూతిపరులకు అడ్డాగా మారుతోందని పోలీస్ ఉన్నతాధికారులు పసిగట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య ఉన్న మంచిర్యాలలో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరులు ఆశ్రయం పొందుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇటీవల ఘటనలు రూఢీ చేస్తున్నాయి.

07/23/2016 - 06:31

హైదరాబాద్, జూలై 22: గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటి వరకు తమకు వివిధ విద్యాలయాల నుంచి అందిన సమాచారం మేరకు 2,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు.

07/23/2016 - 05:59

మహబూబ్‌నగర్, జూలై 22: మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమాలు, ఆందోళనతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ సమస్య తెరపైకి వచ్చేసరికి ఆ సమస్యపై అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోనే మరో సమస్య తెరపైకి రానే వస్తోంది.

07/23/2016 - 05:58

మహబూబ్‌నగర్, జూలై 22: పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవపట్టిస్తుందని, ట్రయల్న్‌ల్రతోనే బంగారు సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు.

07/23/2016 - 05:57

సూర్యాపేట, జూలై 22: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

07/23/2016 - 05:56

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూలై 22: ప్రేమ వ్యవహారం దారుణ హత్యకు దారితీసింది.. మాజీ ప్రియుడే హంతకుడు.. ‘తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనే..’ సినిమా డైలాగును మరిపించేలా హత్యోదంతం వెలుగుచూసింది. పెళ్ళిచూపుల రోజే కాపుకాసి హత్యకు ఒడిగట్టాడు ఓ భగ్న ప్రేమికుడు. ఈ సంఘటన నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

07/23/2016 - 05:55

గద్వాల, జూలై 22: పాలమూరు జిల్లాలో ప్రతి నీటిబొట్టును వినియోగించుకొంటూ రైతుల పొలాలను తడపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

07/23/2016 - 05:54

హైదరాబాద్, జూలై 22: విజయ డెయిరీ సామర్థ్యాన్ని 15లక్షల నుండి 20లక్షల లీటర్లకు పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం విజయ డెయిరీ నూతన ప్యాకింగ్‌లను ఆవిష్కరించారు.

07/23/2016 - 05:53

కొల్లాపూర్, జూలై 22: ఎంజికెఎల్‌ఐ పథకం ద్వారా భూములు కోల్పోయన రైతుల నుంచి మళ్లీ రెండోసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం భూములు లాక్కోవడం అన్యాయమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎంజికెఎల్‌ఐ పథకాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నార్లాపూర్, ఎల్లూరు, కుడికిళ్ల రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

07/23/2016 - 05:52

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లో ఓ అకాడమీ సంస్థ బోర్డు తిప్పేసింది. నగరంలోని కర్మన్‌ఘాట్‌లో ఉన్న నాగార్జున అకాడమీ సంస్థ నిర్వాహకులు శుక్రవారం కనిపించకుండా పోయారు. ఆయా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను తప్పకుండా పాస్ చేస్తామంటూ ఒక్కో విద్యార్థి నుంచి అకాడమీ నిర్వాహకులు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల చొప్పున వసూలు చేశారు.

Pages