S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/23/2016 - 05:37

కొత్తగూడెం, జూలై 22: సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సందడి మొదలయింది. ఒకనాటి ప్రత్యర్థి సంఘాలు ఎఐటియుసి, ఐఎన్‌టియుసిలు ఈ ఎన్నికల్లో ఐక్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవడంతో ఇప్పటి నుండి ప్రత్యర్థి సంఘాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.

07/23/2016 - 03:36

హైదరాబాద్, జూలై 22: మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే విధంగా, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ప్రతి ఒక్కరికీ అన్ని అవకాశాలు అందాలన్న లక్ష్యంతో లక్షా 50వేల కిలో మీటర్ల మేర ఇంటర్‌నెట్ ఫైబర్ లైన్లు వేస్తున్నట్టు మంత్రి తారక రామారావు తెలిపారు. మారుమూల గ్రామాలను ప్రపంచంతో కలపాలని, ఇది ఇంటర్‌నెట్‌తోనే సాధ్యం అవుతుందని అన్నారు.

07/23/2016 - 03:34

హైదరాబాద్, జూలై 22: తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన గ్రీనరీని పర్యవేక్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రతి పరిశ్రమలోనూ మూడవ వంతు చెట్ల పెంపకం ఉండాలని, ఈ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీని కోసం గ్రీన్ బుక్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

07/23/2016 - 03:33

హైదరాబాద్, జూలై 22: ఇక తెలంగాణలో అరచేతిలో జలవనరుల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇది నీటిపారుదల రంగంలో నూతన ప్రయోగం. నీటిపారుదల పరిస్థితి సమీక్షకు ఉపగ్రహ సహకారం తీసుకుంటారు. జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశే్లషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయోగానికి నాంది పలికినట్టు ఇస్రో కితాబు ఇచ్చింది. ఆగస్టు 6న దీనికి సంబంధించి ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

07/23/2016 - 03:29

కరీంనగర్, జూలై 22: సినిమా రిలీజ్ కాకముందే అడ్వాన్స్ బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపిన ‘కబాలి’ సినిమాలోని ఓ సన్నివేశం మరో సంచలనానికి కేంద్ర బిందువైంది. కరీంనగర్‌కు చెందిన ప్రొఫెసర్ రాసిన పుస్తకం కబాలి సినిమాలో హీరో రజినీకాంత్ చదవడం విశేషం. తొలి సన్నివేశంలోనే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకాన్ని చేతబట్టి చదవడంతో కరీంనగర్ పేరు చర్చనీయాంశమైంది.

07/23/2016 - 03:22

హైదరాబాద్, జూలై 22: వరంగల్‌లో ఆగస్ట్ 7న జరగనున్న టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. అదే రోజున తెలంగాణ టెక్స్‌టైల్ పాలసీని ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.

07/22/2016 - 18:13

హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్‌ రామ్‌దేవ్‌గూడ దగ్గర శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, టీప్పర్ ఢీకొన్నాయి. దీంతో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

07/22/2016 - 17:41

హైదరాబాద్: ప్రభుత్వ నిధులను చేజిక్కించుకునేందుకే తెరాస ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే మంత్రి హరీష్‌రావు మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. కొత్త ప్రాజెక్టుల పేరిట నిధులు ఖర్చు చేసే బదులు పెండింగ్‌లో ఉన్నవాటిని పూర్తి చేస్తే పొలాలకు పుష్కలంగా నీరు అందుతుందన్నారు.

07/22/2016 - 17:40

హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు ఈ విషయంలో కష్టపడి పనిచేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన శుక్రవారం నాడు హరితహారంపై సమీక్ష జరిపారు. హరితహారంపై సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. మంత్రుల పనితీరుపైనా తన వద్ద నివేదికలున్నాయన్నారు.

07/22/2016 - 15:16

హైదరాబాద్: ఈనెల 24, 25 తేదీల్లో జరిగే సికిందరాబాద్ మహంకాళి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. జాతరకు ఏర్పాట్లపై ఆయన శుక్రవారం జిహెచ్‌ఎంసి, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Pages