S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/22/2016 - 14:53

హైదరాబాద్: కబాలి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలనుకొనేవారికి థియేటర్ల లో హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గణేష్ థియేటర్‌లో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. అభిమానులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

07/22/2016 - 14:29

మహబూబ్‌నగర్: మక్తల్ మండలం భూత్పూర్ నుంచి జలసాధన సమితి మహా పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే చేపట్టాలంటూ పాదయాత్రను చేపట్టారు. కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బీజేపీ నేత మురళీధర్‌రావు, సీపీఐ నేత గుండా మల్లేష్, టీడీపీ నేతలు, రావుల, బక్కని, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

07/22/2016 - 14:24

హైదరాబాద్: హైదర్‌గూడ‌లో అదృశ్యమైన చిన్నారులు మాధవి, వైష్ణవిలను శుక్రవారం పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కొట్టడం వల్లే మాధవి తాతగారింటికి పారిపోయిందని, తానూ వస్తానని చెప్పడంతో వైష్ణవిని తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

07/22/2016 - 12:28

నల్గొండ: పిల్లాయిపల్లి కాల్వ ద్వారా తమ పొలాలకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిని శుక్రవారం అడ్డుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద రైతులు మంత్రి కాన్వాయ్‌ను నిలిపివేసి తమ సమస్యలను తెలిపారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రిని రైతులు అడ్డగించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

07/22/2016 - 12:27

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. తమ పొలాలకు నీళ్లు వస్తాయా? రావా? అని కొందరు, తమ ప్రాంత భూములకు తగిన నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

07/22/2016 - 12:26

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్లను తక్షణం తొలగించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాడు జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. తన హోర్డింగ్‌ల విషయంలోనూ మినహాయింపు ఇవ్వనక్కర్లేదన్నారు. అక్రమ హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు.

,
07/22/2016 - 05:25

తొగుట, జూలై 21: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో తమ గ్రామం ముంపునకు గురైతే తమ బతుకులు ఎలా సాగుతాయోనన్న బెంగతో ఓ వృద్ధ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలం పల్లెపహడ్ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పల్లెపహడ్‌లో బచ్చలి (బైండ్ల) నర్సింలు (70) భార్య భూదవ్వతో కలిసి నివసిస్తున్నారు.

07/22/2016 - 05:21

వరంగల్, జూలై 21: కోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల కిందట సీజ్ చేసిన వరంగల్ నగరంలోని అయ్యప్ప ఆలయం వివాదాస్పదంగా మారింది. ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు సీజ్ చేయడం పట్ల ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యస్వామి, ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా గురువారం నుండి తిరిగి ఆలయ నిర్వాహకులే యధావిధిగా పూజలను జరుపుకోవచ్చని కోర్టు స్టే ఇచ్చింది.

07/22/2016 - 05:18

హైదరాబాద్, జూలై 21: నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని సమష్టి కృషితో పటిష్ఠం చేసి రవాణా వ్యవస్థను బలోపేతం చేద్దామని, ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందకు అహర్నిషలు కృషి సల్పుతున్న కార్మికులను కన్న బిడ్డలుగా చూద్దామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

07/22/2016 - 05:15

హైదరాబాద్/ఖైరతాబాద్, జూలై 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉగ్రవాదులకు సంఘీభావం తెలిపిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకున్న ఉగ్రవాది బూర్హాన్ వనీకి హెచ్‌సియూలో సంఘీభావం తెలపడం దారుణమన్నారు.

Pages