S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

,
07/22/2016 - 05:14

జహీరాబాద్, జూలై 21: మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాలింత, శిశువు ఇద్దరూ మృతి చెందారు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు, స్థానికులతో కలిసి గురువారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

07/22/2016 - 05:08

నల్లగొండ, జూలై 21: సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడైన కాంట్రాక్టర్ కోమటిరెడ్డి అనిల్‌రెడ్డి ఆస్తుల తనిఖీ నిమిత్తం ఐటి శాఖ గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించింది.

07/22/2016 - 05:04

మహబూబ్‌నగర్, జూలై 21: పాలమూరు ఎత్తిపోతల పథకం ముంపు బాధితుల సమస్యలను తెలుసుకుని పరిశీలించేందుకే అధ్యయనం యాత్ర చేపట్టామని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని టిజెఎసి చైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉండాలి తప్పా.. తమకు తోచిన విధంగా చేయొద్దని ఆయన హితవు పలికారు.

07/22/2016 - 04:59

మహబూబ్‌నగర్, జూలై 21: తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యేవరకూ విశ్రమించబోమని, ప్రాజెక్టులు నిర్మించి రైతుల పొలాలను తడిపి వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు అయిన భీమా ఫేజ్-2, నెట్టెంపాడు ఫేజ్-2, కల్వకుర్తి ఫేజ్-2ల పంప్‌లను ఆ గురువారం ప్రారంభించి కృష్ణాజలాలను వదిలారు.

07/22/2016 - 04:49

హైదరాబాద్, జూలై 21: హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించడానికి పన్నాగం పన్ని దొరికిపోయిన ఉగ్రవాద అనుమానితులు రంగారెడ్డి జిల్లా వికారాబాద్, ధరూర్ మండలాల్లో భూమి కొనుగోలుకు ప్రయత్నించారా? అలాగే అడవుల్లో ఫైరింగ్ ప్రాక్టీసు చేసే అవకాశాలపై వికారాబాద్ వద్ద ఉన్న అడవుల్లో తిరిగారా?

07/22/2016 - 04:46

హైదరాబాద్, జూలై 21: ఉగ్రవాద అనుమానితులకు మద్దతు ఇచ్చే విధంగా హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి శాసనసభాపక్షనేత జి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒవైసీ వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం తన వైఖరిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒవైసీని అరెస్టు చేయాలని కోరుతూ బిజెపి ఇక్కడ సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది.

07/22/2016 - 04:43

హైదరాబాద్, జూలై 21: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ సి పార్థసారథి ఒప్పందంపై సంతకాలు చేశారు.

07/22/2016 - 04:43

హైదరాబాద్, జూలై 21: ఆధునిక వ్యవసాయం అలవాటు చేసేందుకు గిరిజన రైతులకు రాయితీపై ట్రాక్టర్లను అందజేయనున్నట్టు గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95శాతం రాయితీతో 215మంది గిరిజన రైతులకు ట్రాక్టర్లు అందజేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత సంవత్సరం నుంచి వీటిని రెట్టింపు చేయనున్నట్టు చెప్పారు.

07/22/2016 - 04:39

మహబూబ్‌నగర్, జూలై 21: జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. కేవలం రెండు రోజులు మాత్రమే ప్రవహించిన కృష్ణమ్మ ఒక్కసారిగా తన ఉధృతి తగ్గడంతో శ్రీశైలం మల్లన్న చెంతకు ఈ ఏడాది కృష్ణమ్మ వరద ఈ పరిస్థితుల్లో వచ్చేటట్లు కనపడటంలేదు. జూరాల ప్రాజెక్టుకు గురువారం 19000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

07/21/2016 - 18:54

మహబూబ్‌నగర్ : జూరాల ప్రాజెక్టు నుంచి సమాంతర కాల్వ ద్వారా భీమా ఫేస్ 2, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో సాగునీటి అవసరాల కోసం ఎడమకాల్వ ద్వారా 500ల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలోకి 30వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

Pages