S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2016 - 18:49

హైదరాబాద్ : కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం, పాలమూరు, డిండి, శ్రీరామదాసు ప్రాజెక్టుల పురోగతిని సంబంధిత అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని, ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

07/21/2016 - 18:29

హైదరాబాద్‌ : హైకోర్టు విభజనపై వాదనలు గురువారం పూర్తి అయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వే చేసింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కేటాయించాలని దాఖలైన ఫిటిషన్‌పై ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తామింకా రాజధాని నిర్మించుకోలేదని, దానికి అవసరమైన నిధులు కేంద్రం సమకూర్చడంలేదన్న విషయాన్ని కోర్టుకు స్పష్టం చేసింది.

07/21/2016 - 18:15

హైదరాబాద్: అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు సంకీర్త్ కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఓదార్చారు. కాచిగూడలోని సంకీర్త్ ఇంటికి ఆయన గురువారం ఉదయం వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. సంకీర్త్ మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశానని దత్తాత్రేయ తెలిపారు.

07/21/2016 - 18:15

హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారడం లేదని, నగరంలో రహదారుల పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోందని మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం జిహెచ్‌ఎంసి అధికారుల సమావేశంలో రహదారుల పరిస్థితిని సమీక్షించారు. రహదారుల నిర్వహణపై సంబంధిత అధికారులంతా నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

07/21/2016 - 17:43

హైదరాబాద్: హయత్‌నగర్ మండలం రావిరాలలో చెత్తను తరలించే లారీ ఢీకొని ఐదు సంవత్సరాల చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్య కోరుతూ చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

07/21/2016 - 17:40

హైదరాబాద్ : పాలమూరు-డిండి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురువారం సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నల్గొండ, పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు నీటిపారుదలశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

07/21/2016 - 16:39

హైదరాబాద్: ఇటీవల నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తానని ప్రకటించిన ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దేశద్రోహం నేరం కింద కేసు పెట్టాలని బిజెపి నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ తరఫున గురువారం యూసఫ్‌గూడలో సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు.

07/21/2016 - 16:39

హైదరాబాద్: బ్రెజిల్‌లో రద్దు చేసిన పాత కరెన్సీని భారతీయ కరెన్సీలోకి మార్పిడి చేసేందుకు యత్నించిన అయిదుగురిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. రామగుండకు చెందిన 36 ఏళ్ల మహేష్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటూ భానుచందర్, భవానీ ప్రవీణ్, యాదగిరిరెడ్డి, రాధాకృష్ణ అనే యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. బ్రెజిల్‌లో 1986-89 కాలంలో చెలామణిలో ఉన్న కరెన్సీని వీరు ముంబయిలో 36 వేలకు తీసుకున్నారు.

07/21/2016 - 16:38

మెదక్: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మల్లన్నసాగర్ జలాశయ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా నిర్వాసిత రైతు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. గజ్వేల్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అనే రైతు మల్లన్నసాగర్‌తో తన పొలం పోతోందన్న మనస్తాపానికి లోనై బుధవారం సాయంత్రం ఉరివేసుకున్నాడు.

07/21/2016 - 14:36

హైదరాబాద్: ముషీరాబాద్ పఠాన్‌బస్తీలో మూడు కుక్కపిల్లలను తాళ్లతో కట్టి మంటల్లో వేసి పైశాచిక ఆనందం పొందిన ఎనిమిది మంది కుర్రాళ్లను పోలీసులు అరెస్టు చేసి గురువారం నాడు జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని జువైనల్ హోంకు తరలించారు.

Pages