S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/19/2016 - 18:05

హైదరాబాద్: నగరంలోని బడీచౌడి ప్రాంతానికి చెందిన సంకీర్త్ అనే 25 ఏళ్ల యువకుడు అమెరికాలోని టెక్సాస్ నగరంలో సోమవారం హత్యకు గురయ్యాడు. ఈమేరకు ఇక్కడి కుటుంబ సభ్యులకు ఈరోజు సమాచారం అందింది. ఎంఎస్ చదివి టెక్సాస్‌లో గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్న సంకీర్త్‌ను సాయిసందీప్ గౌడ్ అనే యువకుడు హత్య చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానించి ప్రశ్నిస్తున్నారని తెలిసింది.

07/19/2016 - 18:05

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాల ఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు జనార్దనరెడ్డి తెలిపారు.

07/19/2016 - 16:16

హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు భూ సేకరణ రైతుల పాలిట శాపంగా మారందని, నిర్వాసితులకు నష్టపరిహారంపై సిఎం కెసిఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు ఇచ్చితీరాల్సిందేనని మంత్రి హరీష్‌రావు రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల కోసం పాదయాత్రలు చేసేవారిని పోలీసుల ద్వారా అణచివేస్తున్నారని తమ్మినేని అన్నారు.

07/19/2016 - 16:15

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలో నీటిపారుదల రంగం నిపుణులు చేస్తున్న సూచనలను ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ ప్రశ్నించారు. నగరంలో మంగళవారం మల్లన్నసాగర్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదన్న అభిప్రాయాలను సైతం నిపుణులు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

07/19/2016 - 15:24

హైదరాబాద్: నగరంలో పట్టువడ్డ ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ పిటిషన్ ముగియడంతో ఎన్ఐఏ వారిని నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపర్చింది. మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది.

07/19/2016 - 12:04

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోలు, వర్క్‌షాప్‌ల వద్ద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని వివిధ యూనియన్ల నేతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

07/19/2016 - 12:02

మహబూబ్‌నగర్: గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. గద్వాలలోని జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె తన పాదయాత్రను ప్రారంభించారు. ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయం వరకూ ఆమె పాదయాత్ర సాగుతుంది.

07/19/2016 - 11:58

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఆల్పపీడన ద్రోణి ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల వానలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జంట నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో 3, 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు.

07/19/2016 - 11:25

ఖమ్మం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దమ్మక్క ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు దమ్మక్క చిత్రపటానికి పూల మాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. పండ్లతో గిరిజనులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు.

07/19/2016 - 11:11

దిల్లీ: జపాన్‌ రాయబారి యూపాక కికుటుతో తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం సమావేశమై మేకిన్‌ తెలగాణ అంశంపై చర్చించారు. మంత్రి కేటీఆర్‌ మలేసియా ఉప ప్రధానితో, తైవాన్‌ రాయబారి తుంగ్‌కవాంగ్‌తో, దక్షిణ కొరియా రాయబారి హ్యున్‌చావ్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు.

Pages