S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/24/2016 - 08:03

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: ఓ పక్క కృష్ణానది..మరో పక్క తుంగభద్ర నది మధ్యలో నడిగడ్డ ప్రాంతంలోని అమరవాయి గ్రామాన్ని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య ఎడాది క్రితం దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నారు.

04/24/2016 - 08:02

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో గల మారుమూల గ్రామం మొగుల్‌మడక గ్రామం. చదువులో వేళ్లపై లెక్కబెట్టే వారు ఉన్న గ్రామం. గ్రామానికి అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు వెళ్తే జనం ఏం అడుగుతారనే భయం వెంటాడుతూ అధికారిక కార్యక్రమాలు జరిగితే ఎప్పుడు ముగించుకుని వెళ్లిపోదామనే తాపత్రేయం ఉండేది.

04/24/2016 - 08:01

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: రాష్ట్రంలో ఎందరో రాజకీయ నాయకులు, సిని హిరోలు, నటులు, మంత్రులు, వ్యాపారవేత్తలు పబ్లిసిటీ కోసమో లేక జీవితంలో ఏదో ఒక మంచి పని చేసి చూపించాలనే తపనతో తాము ఫలాన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రముఖ సిని నటుడు ప్రకాష్‌రాజ్ గత సంవత్సరం ఆగస్టు మాసంలో దత్తత తీసుకున్నారు.

04/24/2016 - 08:01

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: అదో కుగ్రామం. రాజధానికి కూతవేటు దూరంలోనే ఉన్నా అభివృద్ధికి మాత్రం ఈ గ్రామం ఆమడదూరం. పేరు సిద్దాపూర్. పాలమూరు జిల్లాలో రోడ్డు కూడా లేని, మంచినీటికి అల్లాడే అనేక గ్రామాల్లో ఇదీ ఒకటి. ఇలాంటి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సినీ హీరో మహేశ్‌బాబు ముందుకొచ్చారు. ఈ విషయం తెలియగానే సిద్దాపూర్ గ్రామస్థులు గంతేశారు.

04/24/2016 - 07:49

రామగుండం, ఏప్రిల్ 23: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూనిర్వాసిత కుటుంబాలకు అందజేసే పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి దందా బట్టబయలైంది. న్యాయంగా పొందాల్సిన పరిహారాన్ని ఇక్కడ నిర్వాసితుల ముసుగులో కాజేసిన కోట్ల రూపాయల పరిహారం వ్యవహారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేలతో వెలుగులోకి వచ్చింది.

04/23/2016 - 18:21

హైదరాబాద్: తాము వాడే వాహనాలకు తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకోవడంలో తెలుగు సినీహీరోలు జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని విజయం సాధించారు. వీరిద్దరూ శనివారం ఖైరతాబాద్‌లోని ఆర్‌టిఓ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9999 కోసం రూ.10.5లక్షలు, హీరో అఖిల్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9669కు రూ.41వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

04/23/2016 - 18:12

కరీంనగర్‌: అనవసరపు ఆపరేషన్లు చేసిన జగిత్యాలలో డాక్టర్ టి. సురేష్ కుమార్‌కు చెందిన విజయలక్ష్మీ నర్సింగ్‌‌ హోం, కోరుట్లలోని డాక్టర్ మనోజ్ కుమార్‌ కు చెందిన అయ్యప్ప ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి రాజేషం తెలిపారు.

04/23/2016 - 18:07

హైదరాబాద్: పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరిత పేరును అధికారికంగా ప్రకటించారు. సుచరిత అభ్యర్థిత్వంపై కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సుచరిత విజయానికి ఇతర పార్టీలు సహకరించాలని కోరారు.

04/23/2016 - 17:54

కరీంనగర్: డాక్టర్ల అక్రమ అరెస్ట్‌లను వెంటనే ఆపివేయాలని, రేపు సాయంత్రంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌కు వెనకాడమని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంసుందర్‌ హెచ్చరించారు.

04/23/2016 - 17:52

హైదరాబాద్: దుర్గం చెరువు ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, చెరువు మీదుగా రూ. 184 కోట్లతో 4 లేన్ల సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లతో కూడిన సస్పెన్షన్‌ బ్రిడ్జ్ చేపడతామని మంత్రి కేటీఆర్ శనివారం తెలిపారు. దుర్గం చెరువు ప్రక్షాళనకు పలు కార్పోరేట్ సంస్థలు ముందుకొచ్చాయని, హెరిటేజ్ రాక్‌జోన్‌కు ముప్పు లేకుండా చర్యలు చేపడతామని వివరించారు.

Pages