S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/16/2016 - 00:54

మహబూబ్‌నగర్, జూలై 15: గల గల గోదావరి కదులుతుంటే ...బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి...మురిపాల ముత్యాలు దొర్లుతాయి అనేది తెలుగు ప్రజలు గుర్తుంచుకునే గీతం. అయితే పరిస్థితులు తారుమారు అయిపోయాయి. ఓ పక్క గోదావరి పరుగులిడుతుంటే మరోపక్క కృష్ణమ్మ మాత్రం వట్టిపోయి పలుగురాళ్లు, ఇసుక దిబ్బలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

07/16/2016 - 00:53

భద్రాచలం, జూలై 15: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దే వస్థానంలో శుక్రవారం తొలి ఏకాదశి పూ జలు, రామకోటి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించి లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం చేశారు. విష్ణుసహస్రనామ పారాయణాలు చేశారు.

07/16/2016 - 00:12

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్‌లు ఒక నెల వేతనాన్ని హరిత హారం కార్యక్రమం అమలు కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా మున్సిపల్ ఉద్యోగులు సైతం ఒక రోజు వేతనాన్ని హరిత హారంకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు కెటిఆర్ తెలిపారు.

07/16/2016 - 00:00

హైదరాబాద్, జూలై 15: మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ స్కీం కింద నిర్మించనున్న వట్టెం రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్‌ను తప్పుడు వివరాలతో విడుదల చేయడాన్ని ఆక్షేపిస్తూ వచ్చే సోమవారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వట్టెం గ్రామానికి చెందిన కె వీరానందం, మరో వ్యక్తి..

07/15/2016 - 23:59

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో జోనల్ విధానానికి మంగళం పాడనున్నట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తలెత్తే ప్రధానమైన సమస్యలు, ఉద్యోగుల కేటాయింపు వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 1969లో తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారు పొందకుండా జోనల్ విధానం ఏర్పాటు చేశారు.

07/15/2016 - 23:57

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్, డెంటల్ కోర్సులకు సంబంధించి ఫీజులు త్వరలో ఖరారు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల రెగ్యులేటరీ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ మధ్య వివిధ కాలేజీల ఫీజులను నిర్ధారించనున్నారు.

07/15/2016 - 18:25

కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డి.శ్రీ్ధర్‌బాబు శుక్రవారం పెద్దపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజలతో మమేకమై గెలుపుకోసం కృషి చేయాలన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసమే తెరాస ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు.

07/15/2016 - 18:24

హైదరాబాద్: హరితహారం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ తన వంతు సాయంగా నెలజీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హరితహారంపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈనెల 18న 20 లక్షల మొక్కలను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల్లో హరితహారానికి పదికోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

07/15/2016 - 18:23

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు ఇక్బాల్, ఇలియాస్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు అజ్మీర్ (రాజస్థాన్) తీసుకువెళ్లి పేలుడు పదార్థాల కొనుగోలుకు సంబంధించి వివరాలను సేకరించారు. పేలుడు పదార్థాల కోసం తాము అజ్మీర్ వెళ్లినట్లు నిందితులు ఎన్‌ఐఎ అధికారులకు చెప్పారు.

07/15/2016 - 17:25

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానికి పయనమయ్యారు. శనివారం జరిగే అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఆయన పాల్గొంటారు. విభజన సమస్యలు, నీటి వివాదాలు, హైకోర్టు ఏర్పాటు, నిధుల కేటాయింపులు వంటి అంశాలను ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.

Pages