S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/01/2016 - 12:20

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ప్రాంతీయరవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. నగర శివారులోని పెదఅంబర్‌పేట వద్ద శుక్రవారం ఉదయం ఆర్‌టిఎ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

,
07/01/2016 - 05:24

వరంగల్/ఆదిలాబాద్, జూన్ 30: వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి మోరంచ వాగు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ జలమయమయ్యాయి. మోరంచ వాగులో చిక్కుకున్న ఇద్దరు యువకులను రెస్క్యూ టీమ్ సహాయంతో పోలీసులు సురక్షితంగా బయటికి తీశారు.

07/01/2016 - 05:20

మెదక్, జూన్ 30: ‘నాన్ ప్లాన్ గ్రాం ట్ రూ.1.25 కోట్లు వాపస్ ఎందుకు పోయాయి, ఈ విషయాన్ని ఎందుకు నా దృష్టికి తేలేదు’ అంటూ శా సనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా అంటూ కమిషనర్, ఇంజనీర్లను ఆమె తీవ్రంగా మందలించారు. గురువారం మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో తొలిసారిగా ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

07/01/2016 - 05:18

భద్రాచలం, జూన్ 30: ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యంలో ఐటిడిఎ విడుదలైన నిధులను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో అభివృద్ధి అడుగంటిపోయింది. ఐటిడిఎ పర్సనల్ డిపాజిట్ ఖాతా నుంచి కూడా నిధులు వెనక్కు మళ్లించుకు పోవడంతో కాసులకు కటకట ఏర్పడింది. జిల్లాలోని 5.50లక్షల మంది ఆదివాసీల కోసం ప్రభుత్వం భద్రాచలంలో 1975లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది.

07/01/2016 - 05:17

మహబూబ్‌నగర్, జూన్ 30: రైతుల నుండి భూములు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 123 జిఓను కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోందని, తక్షణమే జిఓను రద్దు చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/01/2016 - 05:14

గద్వాల, జూన్ 30: ధర్మదీక్ష మన కవచం... సవాల్ ఎదుర్కొని ముం దుకు కదులుదాం.. నెత్తురు పొంగే యువకుల్లారా కత్తులుదూసి దూకం డి.. పార్టీలు ఏవైనా జెండా అజెండాలు ఏవైనా ముంచుకు వస్తుంది పెనుము ప్పు.. చెదరవద్దు.. నడగడ్డ ఆకాంక్ష గద్వాల జిల్లా సాధనకే జయపథాకం చేతబూని సమరశంకం మోగిద్దామని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మె ల్యే డికె అరుణ అన్నారు.

07/01/2016 - 05:11

తిమ్మాపూర్, జూన్ 30: కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలంలోని నేదునూరులో గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్‌కు కేటాయించిన స్థలంలో జైలు నిర్మిస్తే ఊరుకోబోమని టిఎస్‌జెఎసి కన్వీనర్ కోదండరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా నేదునూరులో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంటు స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కోదండరాంకు గ్రామస్థులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.

07/01/2016 - 05:10

పటన్‌చెరు, జూన్ 30: ఆటోను వెనుక నుండి లారీ ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం పాల య్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో బుధవారం రాత్రి పదకొండు గంటలు దాటిన తరువాత జరిగింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవరుతో సహా ముగ్గురు మృతి చెందగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు కార్మికులు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

07/01/2016 - 05:09

నిజామాబాద్, జూన్ 30: నిజామాబాద్ జిల్లా సరిహద్దున వివాదాల మాటున మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వద్ద గోదావరి నది జలకళను సంతరించుకుంది. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ప్రవేశించే కందకుర్తి త్రివేణి సంగమంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర వద్ద కూడా గోదావరిలో ప్రస్తుతం కొంతవరకే నీటి జాడలు కనిపిస్తూ, నది పాయలుగా చీలి ప్రవహిస్తోంది.

07/01/2016 - 03:00

హైదరాబాద్, జూన్ 30:మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రభుత్వం వ్యాధులపై నీటి ప్రభావం పరిశీలించేందుకు సర్వే చేయాలని నిర్ణయించింది. శుద్ధమైన నీటి వినియోగంతో నీటి సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అనేక వ్యాధులకు అపరిశుభ్రమైన మంచినీళ్లే కారణం. దీనిపై సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశుభ్రమైన నీటి వల్ల వ్యాధులు తగ్గుతాయి, గ్రామీణ ఆరోగ్యం మెరుగవుతుంది, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.

Pages