S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/30/2016 - 16:52

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి బృందం వద్ద బుధవారం ఉదయం ఓ పెళ్లిబృందానికి చెందిన డిసిఎం వ్యాన్ బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి షాబాద్ మండలం ఉత్తరాస్‌పల్లికి వ్యాన్‌లో సుమారు 60 మంది వెళుతుండగా పరిగి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఇద్దరు, పరిగి ఆస్పత్రిలో ఇద్దరు, రాజేంద్రనగర్ ఆస్పత్రిలో ముగ్గురు మరణించారు.

03/30/2016 - 13:48

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలను ఒకే నెలలో రెండుసార్లు ‘డ్రా’ చేసుకున్నారని బుధవారం టి.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘కాగ్’ నివేదికలో ఆక్షేపించారు. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు అధికంగా చూపినా, చాలా శాఖలో అందుకుతగ్గట్లుగా నిధులు ఖర్చు చేయలేదని, మరికొన్ని శాఖల్లో అవినీతి కారణంగా భారీగా ఆదాయం కోల్పోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

03/30/2016 - 13:50

హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను తక్కువగా నిర్ణయించడం పట్ల ‘కాగ్’ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ‘కాగ్’ నివేదిక పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై మండిపడింది.

03/30/2016 - 13:47

హైదరాబాద్: కరవు పరిస్థితులపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు జీవన్‌రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు. రైతుల గురించి తెలియని వారు కరవుపై మాట్లాడడం వింతగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.

03/30/2016 - 13:46

కరీంనగర్: ఇక్కడి బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం ఓ మహిళపై కొందరు ఆగంతకులు ఆకస్మికంగా దాడి చేసి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

03/30/2016 - 12:05

శంషాబాద్: ఔటర్ రింగురోడ్డుపై తోండుపల్లి వద్ద ఔటర్ రింగు రోడ్డుపై బుధవారం ఉదయం ఓ భారీ వాహనం బోల్తాపడి డ్రైవర్ మరణించాడు. వెంటనే పోలీసులు వాహనాన్ని తొలగించి, డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

03/30/2016 - 12:05

రంగారెడ్డి: పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాన్ రంగారెడ్డి మండలం పరిగి వద్ద బుధవారం ఉదయం బోల్తాపడగా అయిదుగురు మరణించారు. 25 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లా ఉత్తరాసుపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

03/30/2016 - 12:03

హైదరాబాద్: అనావృష్టి కారణంగా రైతులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వ పరంగా సహాయం అందడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 443 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులుండగా, 231 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపిందన్నారు.

03/30/2016 - 05:14

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో విద్యారంగాన్ని అన్ని రకాలుగా పటిష్ఠపరిచి, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అట్టడుగువర్గాలు, పేదలకు సైతం మెరుగైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు.

03/30/2016 - 05:13

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణలో రూ. 35 వేల కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాకరమైన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. టెండర్ల ప్రక్రియను ఖరారు చేసుకోవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ, మార్గదర్శకాల ఖరారును సవాలు చేస్తూ బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.

Pages