S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/28/2016 - 14:33

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ అసమర్థ వైఖరి వల్లే ఉమ్మడి హైకోర్టు విభజన డిమాండ్ యథాతథంగా ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బార్ అసోసియేషన్ కెసిఆర్‌కు తొత్తులా వ్యవహరిస్తోందన్నారు. న్యాయవాదులు కోర్టుల వద్ద కాకుండా తెలంగాణ సచివాలయం, సిఎం క్యాంపు ఆఫీసు వద్ద ఆందోళనలు చేయాలని ఆయన సవాల్ చేశారు.

06/28/2016 - 14:32

దిల్లీ: హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిల ఆప్షన్ల రద్దు విషయమై తెలంగాణలో లాయర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తెరాస ఎంపీలు మంగళవారం ఇక్కడ కేంద్ర న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి తెలంగాణ లాయర్ల సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.

06/28/2016 - 14:31

వరంగల్: పెట్రోల్ ట్యాంకర్లతో వెళుతున్న ఓ గూడ్సురైలు వరంగల్ స్టేషన్‌లో ఒక్కసారి ట్రాక్‌నుంచి పక్కకు ఒరిగింది. ఈ విషయాన్ని వెంటనే గూడ్స్ డ్రైవర్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కకు ఒరిగిన ట్యాంకర్‌ను తప్పించి మిగతా గూడ్సును పంపించివేశారు. యుద్ధప్రాతిపదికపై ట్రాక్‌కు మరమ్మతులు చేపట్టారు.

06/28/2016 - 14:30

హైదరాబాద్: ఇద్దరు జడ్జిలపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసినందుకు మనస్తాపం చెందిన గంపా వెంకటేశం అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో మంగళవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్ల రద్దు కోరుతూ తెలంగాణలో న్యాయవాదులు, జడ్జిలు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

06/28/2016 - 13:32

హైదరాబాద్‌: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా వాతావరణం బాగా చల్లబడి పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. ఆదివారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కోహెడాలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

06/28/2016 - 12:18

హైదరాబాద్: సోమవారం సాయంత్రం నుంచి జోరువాన కురుస్తున్నందున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నాలాల నుంచి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పల్లపు ప్రాంతాల జలమయం కావడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. రంజాన్ మాసం అయినప్పటికీ వర్షం కారణంగా చార్మినార్ తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు మందగించాయి.

06/28/2016 - 12:17

వరంగల్: హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్ల విషయమై కొద్ది రోజులుగా తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. తమ డిమాండ్లను వెంటనే తీర్చాలని నినాదాలు చేస్తూ ఇక్కడి హన్మకొండలోని జిల్లా కోర్టులో లాయర్లు మంగళవారం ఉదయం ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుచెప్పినప్పటికీ లాయర్లు కోర్టు హాలులోకి ప్రవేశంచి కుర్చీలు, బెంచీలను విరగ్గొట్టి విసిరేశారు.

,
06/28/2016 - 05:31

సిరిసిల్ల, జూన్ 27: రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్ చర్యలను నిరసిస్తూ సిరిసిల్ల సీనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదులు హల్‌చల్ సృష్టించారు. కిరోసిన్ సీసాలు, అగ్గిపెట్టెలతో కోర్టు హాలులోకి మూకుమ్మడిగా ప్రవేశించి ప్రవేశించి ఆత్మహత్య చేసుకుంటామంటూ కలకలం రేపారు.

06/28/2016 - 05:26

సిద్దిపేట రూరల్, జూన్ 27: ఎన్ని కుట్రలు పన్నినా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ప్రాజెక్టులు కడుతుంటే టిడిపి, కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.

06/28/2016 - 05:24

నల్లగొండ, జూన్ 27: కృష్ణా పుష్కరాలకు పార్కింగ్ పేరుతో తమ భూములను తీసుకుని సరైన పరిహారం ఇవ్వ కుండా అధికారులు అన్యా యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తమ భూముల్లో పార్కింగ్ పనులు నిర్వహించకుండా వారు అడ్డుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం 600 కోట్ల ఖర్చుతో 9 మండలాల్లో 28 పుష్కరఘాట్‌లు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

Pages