S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/28/2016 - 05:22

కోనరావుపేట, జూన్ 27: కరీంనగర్ జిల్లా కోనరావుపేటలో సోమవారం ఇద్దరు మాజీ నక్సలైట్లను పోలీసుల అరెస్టు చేశారు. మండల కేంద్రం శివారులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తుండగా ఎస్సై రాజ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకుని, రెండు పిస్తోళ్ళు, ఏడు లైవ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

06/28/2016 - 05:19

మిర్యాలగూడ టౌన్, జూన్ 27: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందిపాడు చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కె.నర్మద (27) అనే మహిళను ఆమె భర్త రాము దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. నందిపాడులో నివసిస్తున్న నర్మద నాలుగేళ్ల క్రితం రామును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం నుండి రాము ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.

06/28/2016 - 05:15

హైదరాబాద్, జూన్ 27: శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తి కావస్తుండటంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి మొట్టమొదట తరిలి వెళ్లే శాఖల వివరాలను ఎపి ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడికి వెళ్లే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ అధికారులతో సమీక్షించారు.

06/28/2016 - 05:15

హైదరాబాద్, జూన్ 27: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలువురు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

06/28/2016 - 05:14

హైదరాబాద్, జూన్ 27: నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా నిర్మితమవుతున్న అక్రమ కట్టడాలపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కె.పి. వివేకానందకు చెందిన ఇంటి భవనంలో అక్రమంగా, మంజూరీ ఇచ్చిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మించిన భాగాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దిలిప్ బి. భోంస్లే, జస్టిస్ పి.

06/28/2016 - 05:13

హైదరాబాద్, జూన్ 27: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేరువ కావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది. లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించింది.

06/28/2016 - 05:13

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ భూగర్భ జలాల శాఖలో నాలుగు కేటగిరీ పోస్టులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఈ నెల 28న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనుంది. మరో మూడు కేటగిరిలకు 29వ తేదీన ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనుంది.

06/28/2016 - 05:12

హైదరాబాద్, జూన్ 27: మెదక్ జిల్లా మల్లన్న సాగర్ కింద భూములు నష్టపోతున్న రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భూములు నష్టపోతున్నా, ప్రభుత్వ పరిహారం చెల్లింపు సక్రమంగా లేదంటూ 30 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సోమవారం రైతుల పిటిషన్‌ను కొట్టి వేస్తూ, ప్రభుత్వ వైఖరిని సమర్థించింది.

06/28/2016 - 05:11

హైదరాబాద్, జూన్ 27: మహబూబ్‌నగర్ జిల్లాలో క్యాట్ ఫిష్ పెంపకంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన బెంచ్ ఎంపిటిసి సభ్యులు రాధాకృష్ణారెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించారు. నిషిద్ధ క్యాట్‌ఫిష్‌ను పెద్ద ఎత్తున పెంచుతున్నారని పిటిషనర్లు ఆరోపించారు.

06/28/2016 - 05:11

హైదరాబాద్, జూన్ 27:రాష్ట్రంలో పలు మార్కెట్ కమిటీల పాలక వర్గాలను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా రెండ్ల పద్మను, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇస్మాయిల్ అహ్మద్ జల్ఫీకర్‌ను నియమించారు.

Pages