S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/27/2016 - 15:37

హైదరాబాద్: బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న అభియోగంపై ఇద్దరు జడ్జిలను హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. జడ్జిలకు ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఆందోళనలు చేస్తూ ఆదివారం నాడు రాజ్‌భవన్ వరకూ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే.

06/27/2016 - 15:37

హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సిఎం కెసిఆర్ పదే పదే మోసం చేస్తున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఇఫ్తార్ విందులో మళ్లీ ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కెసిఆర్ ప్రస్తావించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినంత మాత్రాన ముస్లింలకు రిజర్వేషన్లు రావన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

06/27/2016 - 15:36

హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర జడ్జిలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి కోర్టు వద్ద న్యాయవాదులు సోమవారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారిని నిలువరించేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎపి సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా యుద్ధ వాతావరణం నెలకొంది.

06/27/2016 - 15:36

హైదరాబాద్: తెలంగాణలో పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి నేతలు, కార్యకర్తలు సోమవారం నగరంలోని బస్ భవన్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

06/27/2016 - 15:35

హైదరాబాద్: అవకతవకలకు నిలయంగా మారిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై విచారణకు తెలంగాణ సిఎం కెసిఆర్ సిద్ధమేనా?.. అంటూ బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్దన రెడ్డి ప్రశ్నించారు. ఈ సవాల్‌ను స్వీకరించకపోతే, కెసిఆర్‌పై తాను కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ప్రాజెక్టుల రూపంలో దోచుకుంటున్నట్టు తాను నిరూపిస్తానన్నారు.

06/27/2016 - 15:35

దిల్లీ: తెలంగాణలో 1500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఫార్మాసిటీ నిర్మాణానికి తొలి విడతగా 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి కెటిఆర్ అన్నారు. దిల్లీ పర్యటన సందర్భంగా ఆయన సోమవారం నాడు కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. తెలంగాణలో బహుళ ప్రాజెక్టులతో సెజ్‌లు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు.

06/27/2016 - 15:34

హైదరాబాద్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేశాక రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌దే బాధ్యత అని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించడం సరికాదని సిఎల్‌పి నేత జానారెడ్డి సోమవారం అన్నారు. ఆ చట్టాన్ని అమలు చేస్తే రైతులకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే అందుకు విపక్షాలదే బాధ్యత అనడం సరికాదన్నారు.

06/27/2016 - 15:34

హైదరాబాద్: మెదక్ జిల్లాలో చేపట్టే మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూ సేకరణకు సంబంధించి 12 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రాజెక్టు కోసం బలవంతంగా భూ సేకరణ జరగదని, రైతుల సమ్మతితోనే భూ సేకరణ చేస్తారని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందాక హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

06/27/2016 - 15:33

హైదరాబాద్: ఆదివారం రాత్రి ఓ బ్రిటన్ వాసిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వ్యక్తి ఇంగ్లండ్ కు చెందిన జర్కీ వికాస్ గా గుర్తించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఆ వ్యక్తి నుంచి వివరాలు రాబడుతున్నారు.

06/27/2016 - 13:34

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో లాయర్ ఉదయ్‌కుమార్ హత్యకు సంబంధించి కొంతమంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో హాజరుపరిచే అవకాశం ఉంది. కీసరదాయల్ గ్రామ శివారులో పాక్షికంగా దగ్ధమైన కారులో కాలిపోయిన ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. భూ వివాదాల కారణంగానే ఆయనను ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Pages