S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/24/2016 - 04:30

మానవపాడు, జూన్ 23: అష్టాదశ శక్తిపీఠమైన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారు తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారమని అందుకే ఇక్కడ రైల్వేహాల్ట్ స్టేషన్‌గా మార్పు చెందిందని, అలంపూర్ దశ, దిశ మారుతోందని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు నంది ఎల్లయ్య, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఎపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. గురువారం జోగులాంబ రైల్వేస్టేషన్ శంకుస్థాపన జరిగింది.

06/24/2016 - 04:28

హైదరాబాద్, జూన్ 23: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపు బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. మల్లన్న సాగర్ బాధితులకు జెఎసి అండగా ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టులు వస్తేనే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, అయితే మన కోసం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే రైతులకు, గ్రామాలకు ముందు న్యాయం చేయాలని అన్నారు.

06/24/2016 - 04:27

సిద్దిపేట, జూన్ 23: మెదక్ జిల్లా తొగుట మండలంలో చేపట్టే మల్లన్నసాగర్ నిర్మాణంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. 60 ఏళ్లుగా సాగునీరు,తాగునీరు లేక తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో అన్యాయానికి గురైందన్నారు.

06/24/2016 - 04:24

హైదరాబాద్, జూన్ 23: ఆర్టీసీకి తక్షణం రూ.300 కోట్ల సాయం అందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కొత్త బస్సుల కొనుగోలు కోసం మరో రూ. 350 కోట్లను రుణంగా ఆర్టీసీకి ఇప్పించాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసి చార్జిల పెంపు నిర్ణయం తీసుకునే ముందు గురువారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

06/24/2016 - 04:23

నిజామాబాద్, జూన్ 23: జిల్లాలో అటవీ విస్తీర్ణం బాగా కుచించుకుపోయినప్పటికీ, వన్యప్రాణుల వేట మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది. అడవి జంతువులను వేటాడడమే వృత్తిగా మల్చుకున్న ముఠాలు కొన్ని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు వలస వచ్చి స్థానికంగానే మకాం ఏర్పాటు చేసుకుని మరీ మూగజీవాలను బలిగొంటున్నారు. వేటాడిన వన్యప్రాణులను ప్రధాన రహదారుల కూడళ్లలో బాహాటంగానే విక్రయాలు జరుపుతున్నారు.

06/23/2016 - 18:12

హైదరాబాద్: ప్రజలపై భారం మోపాలన్న ఉద్దేశం లేనప్పటికీ ఆర్టీసీ బస్ చార్జీలను పెంచకతప్పడం లేదని, సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రవాణాశాఖామంత్రి మహేందర్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో చెప్పారు. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు 1.30 రూపాయలు, ఆ దూరం దాటితే రెండు రూపాయల చొప్పున పెంచామన్నారు.

06/23/2016 - 18:09

కరీంనగర్: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుండగా విపక్షాలు అన్నింటికీ అడ్డుతగులుతూ శిఖండి పాత్రను పోషిస్తున్నాయని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఆయన గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా విపక్షాలపై విమర్శలు సంధించారు.

06/23/2016 - 18:08

వరంగల్: ఇక్కడి రైల్వేస్టేషన్‌లో కదిలిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించి గురువారం ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఆమె రైలు ఎక్కుతూ తన చేతుల్లో ఉన్న చిన్నారి పాపను దూరంగా విసిరేసింది. గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

06/23/2016 - 18:08

హైదరాబాద్: ఓ వైపు సంపన్న రాష్టమ్రని గొప్పలు చెప్పుకుంటూనే మరో వైపు ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచాలని తెరాస ప్రభుత్వం యోచించడం సరికాదని టి.టిడిపి నేతలు ఎల్.రమణ,రావుల చంద్రశేఖరరెడ్డి గురువారం మీడియాతో అన్నారు. పేదలపై చార్జీల భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తాము ప్రతిఘటిస్తామని వారు స్పష్టం చేశారు.

06/23/2016 - 16:21

హైదరాబాద్: దిల్లీలోని ఎపి భవన్ స్థలాన్ని తెలంగాణ సర్కారుకు కేటాయించాలని సిఎం కెసిఆర్ కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలం తెలంగాణకే చెందాలని, ఎపి భవన్ స్థలాన్ని తమకు కేటాయిస్తే అందుకు తగ్గ నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లిస్తామన్నారు. ఆ స్థలంలో తెలంగాణ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు.

Pages