S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/30/2016 - 14:58

హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో తుది పోటీ సందర్భంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠాలో నలుగురిని నగరంలో అరెస్టు చేశారు. వారి నుంచి 20 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

05/30/2016 - 11:56

హైదరాబాద్: పెట్రోలియం ఉత్పత్తుల రవాణాపై 14.5 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో పెట్రోల్ ట్యాంకర్లు, ట్రక్కుల యజమానులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. దీంతో తెలంగాణలో పెట్రోల్, ఎల్‌పిజి గ్యాస్ ట్యాంకర్లు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లు తీర్చే వరకూ ఆందోళన విరమించేది లేదని ట్యాంకర్ల యజమానులు స్పష్టం చేస్తున్నారు.

05/30/2016 - 11:54

ఆదిలాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలా విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్‌లో సోమవారం జరిగింది. స్థానిక టిడిపి నేతల ఫిర్యాదుపై పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

05/30/2016 - 08:04

వరంగల్, మే 29: వరంగల్ పార్లమెంటు మాజీ సభ్యురాలు డాక్టర్ టి. కల్పనాదేవి ఆదివారం తెల్లవారు జా మున గుండెపోటుతో మృతి చెందా రు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రాత్రి 2గంటలకు మరణించారు. ఈ సంఘటన తెలుసుకున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు.

05/30/2016 - 08:01

హైదరాబాద్, మే 29: వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంలో టిఆర్‌ఎస్ నుంచి తమకు దరఖాస్తు రాలేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ రెండేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా వికాస్ పర్వ్ పేరిట ప్రచారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు.

05/30/2016 - 06:57

హైదరాబాద్, మే 29: కేంద్రం నుంచి అధిక నిధులు సాధించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చేవో అంతే మొత్తాన్ని రాబట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు కసరత్తు మొదలెట్టింది. ఉమ్మడిలో 23 జిల్లాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పది జిల్లాలు మాత్రమే ఉండటంతో సగానికి సగం తగ్గిపోయాయి.

05/29/2016 - 16:38

హైదరాబాద్:వరంగల్ మాజీ ఎంపి కల్పనాదేవి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1984-89 మధ్య వరంగల్‌నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిగా పనిచేశారు. రేపు వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆమె మృతిపట్ల తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంతాపం వ్యక్తం చేశారు.

05/29/2016 - 06:07

వేములవాడ, మే 28: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 1.04 కోట్ల నగదు ఆదాయం సమకూరింది. శనివారం ఆలయ ఆవరణలోని ఓపెన్ కాంప్లెక్స్‌లో హుండీ లెక్కింపు జరిగింది. ఇవో రాజేశ్వర్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, శ్రీ నగరేశ్వరాలయం, శ్రీ నాంపల్లి లక్ష్మినరసింహాలయాల హుండీలను లెక్కించారు.

05/29/2016 - 06:05

జనగామ టౌన్, మే 28: జనగామ జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యమకారులు శనివారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్‌లను జనగామ చౌరస్తాలో అడ్డుకున్నారు.

05/29/2016 - 06:03

కరీంనగర్, మే 28: అది ముళ్ల బాటే అని తెలిసినా.. గల్ఫ్ పయనాలు తప్పడం లేదు. అరబ్ దేశాలు నరకయాతనలు పెడుతున్నా.. కటకటాల్లోకి నెట్టుతున్నా... వలసలు ఆగకపోగా, ఈ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు కరవు, మరోవైపు ఉపాధి లేమి వెరసి నిరుద్యోగులు గల్ఫ్ దేశాలే ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలుగా భావిస్తూ ఆ వైపునకు అడుగులేస్తున్నారు.

Pages