S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/28/2016 - 06:56

పటన్‌చెరు, మే 27: రహదారి వ్యవస్థలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి కోసం వ్యయం చేస్తూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

05/28/2016 - 06:55

కరీంనగర్, మే 27: మాకు పనులు కల్పించడం లేదు.. పని చేసినా కూలీ గిట్టుబాటు కావడం లేదు...కూలీ చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుదంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట ఉపాధి కూలీలు మొరపెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంలో ఉపాధి పనులతోపాటు పలు అభివృద్ధి పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు.

05/28/2016 - 06:54

వరంగల్, మే 27: వరంగల్ జిల్లాలో జిల్లాల ఏర్పాటు లొల్లి ఉద్ధృతమవుతోంది. మొన్నటి వరకు జనగామను జిల్లా కేంద్రంగా చేస్తారని ప్రచారంలో ఉంది. మహబూబాబాద్‌ను కొత్తగా ఏర్పాటయ్యే జనగామ జిల్లాలో కలుపుతారనే ప్రతిపాదనలు ఉండగా మహబూబాబాద్ జెఎసి నాయకులు ఆందోళనలను ఉద్ధృతం చేశారు.

05/28/2016 - 06:53

హైదరాబాద్, మే 27: ఒకవైపు మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బంద్‌లు, ఆందోళనలు సాగుతుండగా, మరోవైపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. జూన్ రెండవ తేదీనే కొత్త జిల్లాల పేర్లు ప్రకటించాలని తొలుత భావించినా, శాస్ర్తియంగా అధ్యయనం చేసి కొత్త జిల్లాలకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

05/28/2016 - 06:52

హైదరాబాద్, మే 27: రెండేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, ఇప్పటి వరకు 40 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అయిందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. నీటిపారుదల శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు నియామక పత్రాలను హరీశ్‌రావు శుక్రవారం అందజేశారు.

05/28/2016 - 06:52

హైదరాబాద్, మే 27: జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో 28వ తేదీన శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నారు. నేషనల్ ఓపెన్ స్కూలింగ్ నుండి టెన్త్ లేదా ఇంటర్ చదివి ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులు. ఎన్‌ఐఓఎస్ ఆధ్వర్యంలో యురేకా ఫోర్బ్సు వారి ద్వారా సేల్స్ ట్రైనీ పోస్టులు ఎంపికకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.

05/28/2016 - 06:50

నల్లగొండ, మే 27: నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కాలువల ఆధునీకరణ పనులు ఏడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ప్యాకేజీల వారిగా సాగుతున్న పనులకు తరుచు గడువు పొడగింపుతో పాటు కొత్త ఒప్పందాలతో ఖర్చు పెరుగిపోతున్నా పనులు మాత్రం సకాలంలో పూర్తి కావడం లేదు.

05/27/2016 - 18:06

హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధి చెందిన కెబిఆర్ పార్కులో చెట్లను నరికివేస్తే తాము సహించేది లేదని, ఈ విషయమై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము జూన్ 5న మానవహారం నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. నగరానికే తలమానికమైన కెబిఆర్ పార్కును నాశనం చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించడం సరికాదన్నారు.

05/27/2016 - 18:06

హైదరాబాద్: నగరంలోని అన్ని పార్కుల్లో జూన్ 2న ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

05/27/2016 - 18:05

దిల్లీ: సికింద్రాబాద్ కంటోనె్మంటు ఏరియాలో గఫ్ రహదారిని మూసివేయరాదని తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం ఇక్కడ రక్షణమంత్రిని కలిసి రహదారిని మూసివేస్తే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వివరించారు.

Pages