S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/13/2016 - 12:22

కరీంనగర్: రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన ఎల్మతుర్తి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు.

05/13/2016 - 12:19

హైదరాబాద్: ఇక్కడి నాచారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ కర్మాగారంలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. సుమారు కిలో మీటరు పరిధిలో దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు జరిగి ఉంటుందని మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు.

05/13/2016 - 04:58

నిజామాబాద్, మే 12: వ్యవసాయ రంగంలో తెలంగాణకు తలమానికంగా నిలుస్తూ, దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ కూడా కరవు తీవ్రత ధాటికి తలొగ్గక తప్పలేదు. దశాబ్దాల కాలం నుండి అధునాతన పద్ధతుల్లో సేద్యం సాగిస్తూ, సాగు రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అంకాపూర్ రైతులు నేడు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.

05/13/2016 - 04:56

హైదరాబాద్, మే 12: కాంగ్రెస్, తెలుగు పార్టీల అనుబంధానికి పాలేరు ఉప ఎన్నిక ఒక పరీక్షా నిలువనుంది. రెండు పార్టీలు కలిసి ఉధృతంగా ప్రచారం సాగిస్తున్న ఈ ఎన్నికల్లో స్నేహం గట్టి ప్రభావాన్ని చూపిస్తే భవిష్యత్తులోనూ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

05/13/2016 - 04:53

హైదరాబాద్, మే 12 : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ వైద్యానికి ప్రాచుర్యం కల్పించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని ఆయుష్ (ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియో, ప్రకృతి వైద్యం) కమిషనర్ డాక్టర్ ఎ. రాజేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ‘పబ్లిక్ ఔట్ రీచ్ ఆక్టివిటీ’ పేరుతో మరో నెలరోజుల్లో భారతీయ వైద్యంపై విస్తృతంగా ప్రచారం చేయబోతున్నామన్నారు.

05/13/2016 - 04:50

వరంగల్, మే 12: భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవ ఉత్సవాలు శుక్రవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం జరిపిన తరువాత చతుస్థానార్చన సదస్యం ఉదయం 11 గంటలకు అమ్మవారిని సావిత్రీ అలంకరణలో సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు జరిపారు. సాయంత్రం 7 గంటలకు సరస్వతి అలంకరణలో హంస వాహనంపై ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

05/13/2016 - 04:45

హైదరాబాద్, మే 12: భగభగమండే ఎండలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు వెళ్లాయి. రాష్ట్రం మొత్తం మీద మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో భూగర్భ జల నీటి మట్టం 54.10 మీటర్ల దిగువకు జారిపోగా, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 4.60 మీటర్లలోతుకు చేరింది. ఈ వివరాలను తెలంగాణరాష్ట్ర భూగర్భ జల శాఖ ప్రకటించింది.

05/13/2016 - 04:44

హైదరాబాద్, మే 12: ఆర్టీసి కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు వేతన బకాయిల్లో 50 శాతానికి 8.75 శాతం వడ్డీతో కూడిన బాండ్లను విడుదల చేయాలని తెలంగాణ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణను కోరింది.

05/13/2016 - 04:43

స్టేషన్ ఘన్‌పూర్, మే 12: ఇద్దరు చిన్నారులను సజీవ దహనం చేసిన తండ్రి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పాంనూర్ గ్రామంలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం ఈవిధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన బత్తిని శ్రీనివాస్, మీదికొండకు చెందిన రేణుకతో 2007లో వివాహం జరిగింది.

05/13/2016 - 04:42

హైదరాబాద్, మే 12: తెలంగాణ ప్రయోజనాలకు సమాధి కట్టాలనుకుంటున్న కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టుల పార్టీలకు పాలేరు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కె తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి పాలేరు ఉప ఎన్నికలను వేదికగా చేసుకోవాలని మంత్రి సూచించారు. పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి మంత్రి బహిరంగ లేఖ విడుదల చేశారు.

Pages