S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/11/2016 - 07:23

న్యూఢిల్లీ, మే 10: తెలంగాణలో కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసార పరీక్షల నిర్వహణ పథకాలను దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించారు.

05/11/2016 - 07:22

నక్కలగుట్ట (వరంగల్), మే 10: తెలంగాణ ఐసెట్ 2016ను ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఐసెట్ వివరాలను వెల్లడించారు.

05/11/2016 - 07:17

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ పాతబస్తీలో కలకలం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అకృత్యాల కేసులో 8మంది నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 9మంది నిందితులను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు కట్టుదిట్టమైన భద్రతతో తీసుకువచ్చారు.

05/11/2016 - 07:16

హైదరాబాద్, మే 10 : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవసరాల కోసం ‘తెలంగాణ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్’ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని 10 జిల్లాలు ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఎపి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌ను రాష్ట విభజన చట్టంలోని పదోషెడ్యూల్‌లో చేర్చారు.

05/10/2016 - 17:48

హైదరాబాద్: ‘నీట్’ పరీక్షకు హాజరయ్యే పేదవర్గాల విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖల మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం తెలిపారు. ‘నీట్’పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేశాక ఎంసెట్‌లో మెడికల్ ఎంట్రన్స్‌పై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘నీట్’లో మంచి ఫలితాలను సాధించేందుకు విద్యార్థులు ఇప్పటి నుంచే తగిన కృషి చేయాలన్నారు,

05/10/2016 - 17:47

హైదరాబాద్: రాబోయే 48 గంటల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతుందని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. కొన్ని చోట్ల వడగళ్లు కురుస్తాయి. చిరుజల్లులతో ఆకస్మిక వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ సహా అన్ని తెలంగాణ జిల్లాలో వాతావరణం చల్లబడింది.

05/10/2016 - 17:45

ఆదిలాబాద్: పాతకక్షల నేపథ్యంలో భైంసా పట్టణంలో ప్రత్యర్థులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. మాజీ కౌన్సిలర్ వహీదా బేగం, ఆమె భర్త న్యామత్ ఖాన్, బంధువు యూసఫ్ ఖాన్ మంగళవారం ప్రత్యర్థుల దాడిలో హతమయ్యారు. ఈ ముగ్గురిని చంపిన తర్వాత ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడులకు తెగబడ్డారు. వహీదా బేగం బంధువుల ఇళ్లపై ప్రత్యర్థులు దాడి చేసి అక్రమ్ బీ (62), అయేషా (16) లను కూడా దారుణంగా నరికిచంపారు.

05/10/2016 - 17:44

హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ పేరిట పాతబస్తీలో పలు అకృత్యాలకు పాల్పడిన ముఠాలో 8 మందిని దోషులుగా రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం ప్రకటించింది. ఒక నిందితుడిని నిర్దోషిగా గుర్తించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ ముఠాపై గ్యాంగ్‌రేప్ అభియోగాలను కోర్టు త్రోసిపుచ్చింది. దోషులుగా తేలిన 8 మందికి బుధవారం తగిన శిక్షలను కోర్టు ఖరారు చేస్తుంది.

05/10/2016 - 14:22

హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు మంగళవారం ఉదయం ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై ఫిలింనగర్ వరకూ కొనసాగింది. చెన్నమనేని సోదరుడు, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగరరావు, మంత్రులు నాయిని, కెటిఆర్, తెరాస, కాంగ్రెస్, టిడిపి నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

05/10/2016 - 14:19

ఆదిలాబాద్: కుటుంబ కక్షలు రాజుకోవడంతో భైంసా పట్టణంలోని బార్ ఇనామ్ గల్లీలో మాజీ కౌన్సిలర్ వహీదా బేగం (50) , ఆమె భర్త న్యామత్ ఖాన్ (55), వరుసకు కుమారుడైన యూసఫ్ ఖాన్ (32)లను ప్రత్యర్థులు మంగళవారం దారుణంగా హతమార్చారు. తొలుత నిర్మల్ రోడ్ వద్ద న్యామత్, యూసఫ్‌లను వెంటాడి చంపిన ప్రత్యర్థులు ఆ తర్వాత ఇంట్లో ఉన్న వహీదాను కూడా హతమార్చారు. ముగ్గురి హత్యతో ప్రస్తుతం భైంసాలో ఉద్రిక్తత ఏర్పడింది.

Pages