S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/01/2015 - 18:40

నల్గొండ : యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్శింహులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వైకుంఠ ద్వారం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న మోత్కుపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు.

12/01/2015 - 17:09

మెదక్ : జిల్లాలోని కోల్చారం మండలం తుక్కాపూర్‌లో అటవీ అధికారులను, గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు వలలో చిక్కింది. జనవాసాల్లో సంచరిస్తూ మంగళవారం నాడు దాదాపు తొమ్మిది మందిని గాయపరిచింది. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

12/01/2015 - 17:08

నల్గొండ : సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తమను వేధిస్తున్న ఉపాధ్యాయులపై షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా విద్యాశాఖాధికారులకు కూడా వారు ఫిర్యాదు చేశారు.

12/01/2015 - 13:44

వరంగల్ : వరంగల్‌లోని పురాతన రామప్ప ఆలయంలోని శివలింగం కుంగిపోతుంది. ఇప్పటికే సోమసూత్రం మూసుకుపోవటంతో గర్భాలయంలో నీరు నిలిచిపోతుంది. కార్తీక మాసం కావటంతో అభిషేకాలు చేయలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.

12/01/2015 - 13:43

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా కలెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. జిల్లాలోని 1510 గ్రామాలలో సారాను అరికట్టామని, మూడు నెలల్లోనే గుడుంబాను అరికట్టామని వెల్లడించారు. అలాగే కల్తీ కల్లును కూడా అరికడతామని ఆమె తెలియజేశారు.

12/01/2015 - 11:44

మెదక్: కొల్చారం మండలం తుకాపురం వద్ద మంగళవారం ఉదయం చిరుత దాడిలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన బుచ్చెమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుత సంచారం విషయమై పోలీసు, రెవిన్యూ, అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవట లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

12/01/2015 - 11:43

కరీంనగర్: మద్యం మత్తులో సోదరిని హత్య చేయడమే కాక, అడ్డుకున్న మరో యువకుడిని ఓ తాగుబోతు తీవ్రంగా గాయపరిచిన సంఘటన వేములవాడ మండలం అయ్యోరుపల్లిలో జరిగింది. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల వల్లే ఆ యువకుడు తన సోదరి రాంబాయిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

12/01/2015 - 11:43

హైదరాబాద్: మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటనలో మండల విద్యా శాఖాధికారి బసవలింగంను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. బాలిక నిత్యం పాఠశాలకు వస్తున్నా ఆమె గర్భవతి అని గుర్తించలేక పోవడం, బడిలోనే ప్రసవం జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు హెడ్మాస్టర్ తెలియజేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

12/01/2015 - 11:42

సికిందరాబాద్: వంట గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ దూసుకొచ్చి ఓ బైక్‌ను ఢీకొనడంతో సికిందరాబాద్‌లో మంగళవారం ఉదయం భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో బైక్‌ను నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆనంద్ థియేటర్ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు స్తంభించిపోయాయి.

11/30/2015 - 11:51

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల నుంచి తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పోటీ చేసే సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తామని వారు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు మిగతా విపక్షాలను కలుపుకొని పోతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Pages