S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/06/2020 - 06:14

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ రాష్ట్రంలో ఔత్సాహికులైన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని ‘వీ హబ్’ (ఉమెట్ ఎంటర్‌ప్య్రూనర్స్ హబ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రావుల దీప్తి తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న ‘వీ హబ్’ కార్యాలయంలో గురువారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక విధానంలో భాగంగానే వీ హబ్ ఏర్పాటైందన్నారు.

03/06/2020 - 06:11

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నూతన చాంబర్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డికి శాసనసభ వ్వవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా ఉన్నారు.

03/06/2020 - 06:10

హైదరాబాద్, మార్చి 5: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని, ఎండగడుతామని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాలు కనీసం 30 రోజులు జరగాలన్నారు. అన్ని పద్దులపై సంపూర్ణంగా అర్థవంతమైన చర్చ జరగాలంటే కొన్ని రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహిస్తే సరిపోదన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు.

03/06/2020 - 05:59

హైదరాబాద్: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని, ప్రభు త్వ విధానాలను ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమని పీసీసీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

03/06/2020 - 05:58

హైదరాబాద్, మార్చి 5: పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)తో భారతీయులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదని, ఇక్కడ పుట్టిన వారంతా భారతీయులేనని, కానీ విపక్షాలు దీనిపై అసత్య ప్రచారం చేసి రాజకీయ కుట్రకు పాల్పడుతున్నాయని, అల్లర్లకు కారణమవుతున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు.

03/06/2020 - 05:57

హైదరాబాద్, మార్చి 5: తమిళనాడు రాష్ట్రానికి తాగునీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతి భవన్‌లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డీ జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ మణివాసన్, సలహాదారు ఎం షీలా ప్రియ తదితరుల బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి తమ రాష్ట్రానికి తాగునీరు ఇవ్వాలని కోరారు.

03/06/2020 - 05:55

హైదరాబాద్, మార్చి 5: రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, వైస్ చైర్మన్‌గా నల్లగొండ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహకార బ్యాంక్ కార్యాలయంలో గురువారం ఉదయం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు.

03/06/2020 - 05:51

హైదరాబాద్: కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపించిన ఇద్దరి శాంపిళ్లలో ఆ వ్యాధి లేదని తేలింది. ఈ మేరకు ఎన్‌ఐవీ రిపోర్ట్‌లో సంబంధిత అధికారులు పేర్కొన్నారని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏర్పాటు చేసిన సర్వెలెన్స్ వైద్య బృందంతో కోఠిలోని వైద్య శాఖ కార్యాలయంలో గురువారం ఆయన సమావేశమయ్యారు.

03/06/2020 - 05:50

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడగానే సమావేశాలను ఎప్పటివరకు, ఎన్ని పని దినాలు నిర్వహించాలనేది శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై ఖరారు చేస్తుంది.

03/05/2020 - 06:22

హైదరాబాద్, మార్చి 4: ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను తెలంగాణలోనూ గుర్తించడంతో ఐటీ పరిశ్రమ ఉలిక్కిపడింది. తెలంగాణలో నమోదైన కరోనా అనుమానితుల జాబితాలోని 81 మందిలో సగానికి పైగా ఐటీ ఉద్యోగులు కావడం గమనార్హం. దీంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్లో భయాందోళన తొలగించడానికి వర్కు ఎట్ హోంను ఆదేశించాయి. ఇప్పటికే ఐటీ రంగంలో 62 శాతం మంది వర్కు ఎట్ హోంలోనే ఉన్నారు.

Pages