S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/05/2016 - 15:08

నల్గొండ: తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన గురువారం నల్గొండ జిల్లాలో పర్యిటిస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో చిన్న ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నారు. కరవు నెలకొన్న నల్గొండ జిల్లాను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.

05/05/2016 - 12:14

హైదరాబాద్: నగరంలోని సిఎం కెసిఆర్ క్యాంప్ కార్యాలయానికి సమీపంలో గురువారం ఉదయం ఓ కారును మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అమెరికన్ క్యాన్స్‌లేట్ కార్యాలయానికి చెందిన కారు ధ్వంసమైనట్లు సమాచారం.

05/05/2016 - 05:51

ఇటుక విసిరితే రాయతో కొడతాం నీళ్ల కోసమే అయతే గోదావరి పుష్కలం
వాడుకునే తెలివి, దమ్ముంటే తీసుకోండి కుళ్లు రాజకీయాలతో చిచ్చు పెట్టకండి
మీ ఇద్దరి సంగతీ మాకు తెలుసు బాబు, జగన్‌పై సిఎం కెసిఆర్ నిప్పులు

05/05/2016 - 05:44

హైదరాబాద్, మే 4: తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖాళీ అయపోయంది. తెలంగాణ భవన్‌లో బుధవారం సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో వైకాపా తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గం, వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు, ఆరు జిల్లాల అధ్యక్షులు తెరాసలో చేరారు.

05/04/2016 - 17:58

హైదరాబాద్: తెలంగాణ వైకాపా అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ఇక్కడ సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. తన చేరికతో టి.వైకాపా తెరాసలో విలీనమైనట్లేనని పొంగులేటి ప్రకటించారు. పార్టీ కండువాలు వేసి ఈ ఇద్దరినీ తెరాసలోకి సిఎం ఆహ్వానించారు.

05/04/2016 - 17:09

హైదరాబాద్: ప్రపంచంలో సరికొత్త రికార్డు సాధించేలా తెలంగాణలో ఒకే రోజు పాతిక లక్షల మొక్కల్ని నాటాలని నిర్ణయించినట్లు మంత్రి కెటిఆర్ బుధవారం తెలిపారు. జూలై 11న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడతామని, ఇందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు.

05/04/2016 - 17:09

వరంగల్: తెలంగాణలో చేపట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులపై టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు రోజుకోసారి కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన బుధవారం కేసముద్రం మండలం దేవరప్పులలో చెరువు పనులను ప్రారంభించినం సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ నీటిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే టి.టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

05/04/2016 - 17:08

హైదరాబాద్: ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఇపుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం దీక్ష వహించిన సిఎం కెసిఆర్ శిలావిగ్రహాన్ని పెడితే అందులో తప్పేమీలేదని తెరాస నాయకులు మందా జగన్నాథం, బి.నర్సయ్య గౌడ్ బుధవారం మీడియాతో అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై రాజకీయం చేస్తూ ఎపి సిఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని వారు విమర్శించారు.

05/04/2016 - 17:08

హైదరాబాద్: నగరంలోని మన్సూరాబాద్ వద్ద బుధవారం పట్టపగలు రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళ మెడలో నుంచి చైన్‌స్నాచర్లు నాల్గు తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుపై ఎల్‌బి నగర్ పోలీసులు చైన్‌స్నాచర్ల కోసం గాలిస్తున్నారు.

05/04/2016 - 14:43

కరీంనగర్: మంథనిలోని ఆర్‌టిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న కోటేశ్వరరావు ఇంటిపై బుధవారం ఎసిబి అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నట్లు ఇతనిపై ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు ఆకస్మిక సోదాలు ప్రారంభించారు. ఈ విషయం తెలిసి కోటేశ్వరరావు పరారయ్యాడు.

Pages