S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/30/2016 - 18:11

హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం ప్రాజెక్టులను బలిచేయరాదని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎపి సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైఎస్ బాటలోనే జగన్ ప్రయాణిస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

04/30/2016 - 18:11

నల్గొండ: వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో దంపతులు మరణించిన ఘటన వలిగొండ మండలం నాతళ్లగూడెం వద్ద శనివారం సాయంత్రం జరిగింది. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

04/30/2016 - 18:09

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ విందు భోజనంలో పాల్గొన్న సన్నివేశం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కుమార్తె వివాహ వేడుకకు కెసిఆర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్, ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్, కాంగ్రెస్ నేతలు ఒకే టేబుల్‌పై విందు భోజనం చేశారు.

04/30/2016 - 18:07

మహబూబ్‌నగర్: తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చితే మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు సరిగా అమలు జరగడం లేదని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు తీవ్రంగా మందలించారు. అడ్డాకుల మండలంలో ఆయన శనివారం చెరువు పనులను ప్రారంభించారు. ఇరిగేషన్ అధికారుల తీరు మారకుంటే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

04/30/2016 - 15:26

నల్గొండ: తమను పరీక్షలకు అనుమతించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఈ ఘటన జరిగింది. తమకు కళాశాల యాజమాన్యం హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని ముగ్గురు విద్యార్థులు భవనంపైకి ఎక్కి కిందకు దూకేస్తామని బెదిరించారు. సమాచారం తెలిశాక పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థులను కిందకు రప్పించారు.

04/30/2016 - 14:07

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కెటిఆర్ మితిమీరిన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తానని కెటిఆర్ అనడం అహంకారానికి పరాకాష్ట అన్నారు. రాజకీయ దాహంతో వ్యవహరిస్తున్న సిఎం కెసిఆర్‌కు తెలంగాణలో నీటికష్టాలు, కరవు పరిస్థతులు పట్టవని విమర్శించారు.

04/30/2016 - 14:04

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపఎన్నికలపై ఆసక్తి చూపే సిఎం కెసిఆర్ తాగునీటి సమస్యపై కొంత శ్రద్ధ చూపినా జనం సమస్యలు గట్టెక్కేవని యూత్ కాంగ్రెస్ నేతలు అన్నారు. ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

04/30/2016 - 12:38

హైదరాబాద్: నగరంలోని మోతీనగర్ లలితా టవర్ వద్ద శనివారం ఉదయం ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి, క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న అయిదుగురు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.40 లక్షల రూపాయల నగదు, ల్యాప్‌టాప్, 15 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

04/30/2016 - 12:37

వరంగల్: ఎండిపోయిన తాటిచెట్టు వారిపాలిట మృత్యుదేవతగా ఎదురైంది. ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తాటిచెట్టు విరిగిపడడంతో ముగ్గురు మరణించిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్ ఘనపూర్ మండలం సిర్పూర్‌గుట్ట వద్ద జరిగింది. ఈ గుట్టపై రాళ్లు కొట్టేందుకు గోదావరిఖని నుంచి ఇటీవల కొంతమంది కూలీలు వచ్చి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

04/30/2016 - 12:36

ఆదిలాబాద్: నకిలీ ఎటిఎం కార్డులను తయారుచేసి జిల్లాలో పలు ఎంటిఎం కేంద్రాల్లో నగదు చోరీ చేసిన హర్యానాకు చెందిన రెహ్మాన్ అనే ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని ముఠాకు చెందిన మరో నలుగురిని కూడా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి నకిలీ ఎటిఎం కార్డులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Pages