S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/29/2016 - 13:59

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత శుక్రవారం నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆమె ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన భర్త, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలతో గెలుస్తానని ఆమె అన్నారు.

04/29/2016 - 12:44

ఖమ్మం: కార్యకర్తల కోలాహలం నడుమ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం పాలేరు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు కెటిఆర్, కడియం శ్రీహరి, పార్టీ నేతలు హాజరయ్యారు.

04/29/2016 - 12:43

వరంగల్: రెండేళ్ల కుమార్తెతో పాటు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పరకాల మండలం కంఠాత్మకూర్‌లో శుక్రవారం ఉదయం ఈ విషాద సంఘటన వెలుగు చూసింది.

04/29/2016 - 12:42

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి టిడిపి మద్దతు ప్రకటించడం దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి కెటిఆర్ అన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో కనిపించని సానుభూతి పాలేరులోనే టిడిపి నేతలకు కనిపించిందా? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు ఎన్ని రాజకీయాలు చేసినా, పాలేరులో తమ అభ్యర్థి తుమ్మల గెలుపు ఖాయమన్నారు.

04/29/2016 - 07:30

సూర్యాపేట, ఏప్రిల్ 28: సూర్యాపేట- ఖమ్మం రహదారిపై చివ్వెంల మండలం అక్కల్‌దేవిగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యుడు బానోతు మదన్‌లాల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

04/29/2016 - 07:26

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటి (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. టిజెఎసి ఆధ్వర్యంలో కరవు పరిస్థితులపై గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ కరవుపీడిత గ్రామాలలో మంచి నీటి సరఫరాకు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు.

04/29/2016 - 07:25

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాజధాని నగరంలోని పాతబస్తీలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అక్రమ దందాకు పాల్పడుతున్న ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే ఓపియమ్ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఖయ్యూం ఉల్లాఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన చందన్ నవీన్ కలసి నగరంలో డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నారు.

04/29/2016 - 07:24

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: గత మూడు దశాబ్దాల కాలం నుండి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ కారణంగా ముందడుగు పడుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరాలని తెలంగాణలోని మూడు జిల్లాలకు కృష్ణా జలాలను అందించాలనే సంకల్పంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగబోతోంది.

04/29/2016 - 07:23

కొత్తూరు, ఏప్రిల్ 28: ప్రముఖ సినీ హీరో, ప్రిన్స్ మహేష్‌బాబు తాను దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామంపై ఎట్టకేలకు దృష్టి సారించారు. ‘దత్తత ఉత్తిదే’ శీర్షికన ఆంధ్రభూమిలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరంతో గ్రామ సంక్షేమం వైపు అడుగులు వేశారు. ఇందులో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

04/29/2016 - 07:19

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 28: ఒకరిద్దరు నాయకులు చెప్పే మాటలు వినిపించుకుని ప్రజా సమస్యలను పక్కన పెట్టడం బాగాలేదని సంయుక్త కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, గజ్వేల్ అభివృద్ధి అథారిటీ అధికారి (గఢా)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

Pages