S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/29/2016 - 06:40

కల్లూరు, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామ సమీపాన గురువారం ఉదయం రాష్ట్రీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. ఈ విషయమై ఎస్సై పి సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటి పాయల గ్రామానికి చెందిన సింగారపువెంకన్న (25) సుద్ద లోడు లారీతో సత్తెనపల్లి వైపు వెళుతున్నాడు.

04/29/2016 - 03:49

హైదరాబాద్, ఏప్రిల్ 28: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు స్వయంగా సేకరించిన రెండువేల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తమ విరాళాలు ఉపయోపడాలని ఆకాంక్షించారు.

04/29/2016 - 03:44

హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాలోని సియాటెల్ నగరంలో తొలిసారిగా టిఆర్‌ఎస్ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలుగా తమ వంతు సహకారం అందిస్తామని కార్యక్రంలో ఎన్‌ఆర్‌ఐ సుధీర్ జలగం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలుత ప్రాణాలు అర్పించిన అమరవీరులకు రెండు నిమిషాలు వౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు.

04/28/2016 - 17:52

హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో పోటీ చేయరాదని బిజెపి తెలంగాణ విభాగం నిర్ణయించింది. ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం గానీ, ప్రచారం చేయడం గానీ ఉండదని టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం ప్రకటించారు.

04/28/2016 - 16:54

హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సుచరితకు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక నెల వేతనాన్ని విరాళం ఇస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటించారు. గురువారం జరిగిన సిఎల్‌పి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. తెరాసలోకి కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు వలస వెళ్లడంపై కూడా సమావేశంలో చర్చించారు.

04/28/2016 - 16:53

నల్గొండ: వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ప్రయాణిస్తున్న కారు గురువారం నల్గొండ జిల్లా మోతే సమీపంలో లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఆయన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

04/28/2016 - 16:52

హైదరాబాద్: ఇక్కడి శంషాబాద్ ఎయిర్ పోర్టులో గురువారం కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని సోదా చేసి దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి ఆధారాలు చూపాలని నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

04/28/2016 - 16:50

హైదరాబాద్: కరవుపరిస్థితులపై పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 5,6 తేదీల్లో దేశవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు జరుపుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సరిగా అమలు చేయనందునే రైతుకూలీలు వలసపోతున్నారన్నారు. తెలంగాణలో దుర్భిక్షం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ తెరాస ప్లీనరీలో ఎలాంటి చర్చ జరగకపోవడం దారుణమన్నారు.

04/28/2016 - 16:50

హైదరాబాద్: ఖమ్మంలో పార్టీ ప్లీనరీని అట్టహాసంగా నిర్వహించిన తెరాస నేతలకు తెలంగాణలో కరవుపరిస్థితులపై చర్చించేందుకు సమయం దొరకలేదా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ద్రోహి అని, ఆయనను పాలేరు ఉపఎన్నికలో ఓడించాలని అన్నారు.

04/28/2016 - 14:07

హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్‌సాగర్‌లోనే నిర్వహించాలని, ఇందుకోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయాలని ఉమ్మడి తెలుగురాష్ట్రాల హైకోర్టు గురువారం ఆదేశించింది. సహజరంగులను వాడేలా, వినాయక విగ్రహాల ఎత్తును తగ్గించేలా ప్రజల్లో అవగాహన పెంచాలని న్యాయస్థానం ఆదేశిస్తూ కేసు విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.

Pages