S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/28/2016 - 14:07

హైదరాబాద్: తెరాసలోకి వలసల జోరు అధికం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం నగరంలో సమావేశమయ్యారు. ఫిరాయింపులను ఆపేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ భేటీకి ఎమ్మెల్సీలను పిలవకపోవడంపై ఖమ్మం జిల్లా నేత పొంగులేటి సుధాకర రెడ్డి అలక వహించగా ఆయనను కొందరు కాంగ్రెస్ నేతలు బుజ్జగించారు.

04/28/2016 - 12:53

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లో బుధవారం రాత్రి వేణు సీతారాం అనే బిఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఆగంతకులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై గురువారం ఉదయం విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

04/28/2016 - 12:53

హైదరాబాద్: మెదక్ జిల్లా దేవుళ్లపల్లికి చెందిన కొంతమంది ట్రాక్టర్‌లో దైవదర్శనానికి సురారం వెళ్లి తిరిగి వస్తుండగా దుండిగల్ వద్ద బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

04/28/2016 - 12:53

హైదరాబాద్: పాతబస్తీలోని రెయిన్ బజార్, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, మొగల్‌పురా తదితర ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జామును పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి అయిదుగురు రౌడీషీటర్లను అరెస్టు చేశారు. ఈ ప్రాంతాల్లో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మామిడిపండ్లను కార్బడైతో కృత్రిమంగా మగ్గపెడుతున్న నేరంపై అయిదుగురు వ్యాపారులను అరెస్టు చేశారు.

04/28/2016 - 12:52

హైదరాబాద్: స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం నగరంలో దాడులు చేసి మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. కోల్‌కత నుంచి తెచ్చిన సుమారు మూడు కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.

04/28/2016 - 04:24

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎర్రకోటగా పేరుబడిన ఖమ్మం జిల్లా తొలిసారి పూర్తిగా గులాబీమయమైంది. జిల్లాలో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభ, ప్లీనరీ విజయవంతమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపా ఏ పార్టీ అధికారంలో ఉన్న వారి అధికార హద్దులు ఖమ్మం సరిహద్దు వరకే. ఖమ్మం మాత్రం వామపక్షాలకు శత్రు దుర్బేద్యంగానే నిలిచేది. అయతే, తెలంగాణ ఆవిర్భావం తరువాత, తెరాస అధికారంలోకి వచ్చాక ఎర్రకోట కాస్తా గులాబీగా మారుతోంది.

04/28/2016 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 27: రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్ పరిధిలో ఈ రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

04/28/2016 - 04:21

ఖమ్మం, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ సమావేశంలో 15 కీలక తీర్మానాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, శాంతి భద్రతలు, విభజన చట్టం హామీలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ప్రతినిధులు, నేతలు హర్షద్వానాల మధ్య ఆమోదం తెలిపారు. తీర్మానాలు చేసే సమయంలో ప్రతినిధుల నుంచి వచ్చిన సానుకూల స్పందన చూసి సిఎం హర్షం వెలిబుచ్చారు.

04/28/2016 - 04:17

ప్రజల అజెండానే మా అజెండా. మాకు ఎవరూ బాసులు లేరు. ప్రజలే మా బాసులు. వారే మా అజెండా..
హైకమాండూ వాళ్లే.

04/27/2016 - 17:54

హైదరాబాద్: నగరంలోని చంపాపేట ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేసి 930 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. సితార అగ్‌మార్క్ బ్రాండ్ పేరిట కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు సమాచారం తెలిశాక ఈ దాడులు చేశారు. నెయ్యి తయారీ కేంద్రంతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు.

Pages