S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2015 - 17:15

నిజామాబాద్‌: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌ వల్ల 3లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం లేదని, ఈ విషయంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సదాశినగర్‌ మండలం క్రాస్‌రోడ్‌ దగ్గర ప్రాణహిత చేవెళ్లపై జరిగిన బహిరంగ సభలో జానారెడ్డి పాల్గొన్నారు.

12/29/2015 - 13:30

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పదో యూనిట్ లో అధికారులు మరమ్మతులు చేపట్టారు.

12/29/2015 - 11:38

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హఫీజ్ బాబా నగర్, బహదూర్‌పురా, కాలాపత్తర్, తదితర ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి, పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. దాదాపు 450 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

12/29/2015 - 11:38

హైదరాబాద్: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు రాజ్‌భవన్‌లో విడిది చేస్తారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రాష్టప్రతి, పలువురు ప్రముఖులు పాల్గొంటారు. రాష్టప్రతి రాక సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

12/29/2015 - 11:37

నల్గొండ: కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆటోను ఓ కారు ఢీకొన్న ఘటనలో 8 మంది క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

12/29/2015 - 11:35

హైదరాబాద్: దాదాపు 45 చిత్రాలలో నటించిన తెలుగు సినీ హాస్యనటుడు పొట్టి రాంబాబు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడికి చెందిన ఆయన ‘ఈశ్వర్’ ‘చంటిగాడు’ ‘గోపి గోపిక గోదావరి’ తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

12/29/2015 - 11:34

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి ఐదు కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను సోదా చేయడంతో ఈ బంగారం బయటపడింది.

12/29/2015 - 07:59

కాకతీయుల కాలంనాటిదని చెబుతున్న పండితులు
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

12/29/2015 - 07:59

వెంటాడుతున్న క్రాస్ ఓటింగ్ బెడద
ఎమ్మెల్సీ ఫలితాలపై నేతల్లో ఉత్కంఠ
కాంగ్రెస్ నేతల్లో పెరిగిన ధీమా
అంచనాలతో మునిగి తేలుతున్న నేతలు

12/29/2015 - 07:58

కోర్టు ఆదేశాలతో 30న సమావేశం

Pages