S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/26/2016 - 12:11

హైదరాబాద్: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృత్యువాత పడిన ఘటన నగర శివారు రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో జరిగింది. పాషా, సమీర్, ప్రశాంత్ అనే ముగ్గురు ఇంట్లో చెప్పకుండా సోమవారం సాయంత్రం ఉందాసాగర్ చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మైలదేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

04/26/2016 - 07:36

హైదరాబాద్, ఏప్రిల్ 25: అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఎండల భయం పట్టుకుంది. తెలంగాణలో వడగాల్పుల తీవ్రత మరో రెండు, మూడు రోజులపాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంలో ప్లీనరీని ప్రతినిధుల వరకే పరిమితం చేయాలని టిఆర్‌ఎస్ భావిస్తుంది. ప్లీనరీకి వచ్చే సందర్భంలో వడదెబ్బ బారిన పడకుండా సాధ్యమైనంత వరకు జనాన్ని నియంత్రించాలని పార్టీ భావిస్తుంది.

04/26/2016 - 07:35

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆదర్శంగా ఉంటాయనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కారణంగా అనైతికంగా మారుతున్నాయని టి.పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం. కోదండరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి జి. నిరంజన్‌లు విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ అంటే ఫిరాయింపులేనా? అని వారు సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

04/26/2016 - 07:34

హైదరాబాద్, ఏప్రిల్ 25: హుస్సేన్ సాగర్‌లో కాలుష్యనివారణకు కఠిన చర్యలు తప్పవని హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా మరింత కాలుష్యం ఏర్పడకుండా ప్రత్యేక ఆవరణల నిర్మాణం అనివార్యమని పేర్కొంది. అలాగే పరిసరాల్లోని చెరువులను కూడా పరిరక్షించాలని హైకోర్టు పేర్కొంది. ప్రత్యేక ఆవరణల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

04/26/2016 - 07:33

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ ప్రక్రియపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్దంగా నూటికి నూరు శాతం ఉల్లంఘనలు ఉంటే అటువంటి వాటిని క్రమబద్దీకరించ వద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

04/26/2016 - 07:33

హైదరాబాద్, ఏప్రిల్ 25: మూడు కోర్టు ధిక్కార కేసుల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ముగ్గురు అధికారులకు జరిమానా విధించారు. ఐఎఎస్‌లకు ముస్సోరిలో శిక్షణ ఇస్తున్న సమయంలో న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాలని సంవేద్యీకరణ చేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

04/26/2016 - 07:32

హైదరాబాద్, ఏప్రిల్ 25: కెసిఆర్ బస్సు యాత్రకు ఎండలు బ్రేకు వేశాయి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే బస్సు యాత్ర చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించినప్పటికీ, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి భద్రాచలం శ్రీసీతారామ కళ్యాణానికి వెళ్లిప్పుడు ఎండల వల్ల అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే.

04/26/2016 - 07:31

హైదరాబాద్, ఏప్రిల్ 25: పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులను రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లా పరిషత్, మెదక్ జిల్లా సిద్ధిపేట, మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి రెండు మండలాలు, మరో నాలుగు గ్రామపంచాయతీలు అందుకున్నాయి.

04/26/2016 - 07:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో వివిధ రకాల వ్యాధులతో ఏటా కోట్లాది మంది జనం అనారోగ్యం పాలవుతున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నివారించడానికి వీలున్న వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది మృతి చెందుతున్నారని ఆయన అన్నారు. ప్రజారోగ్యనికి సంబంధించిన మూడు అంశాలను కేంద్రానికి లోక్‌సత్తా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రతిపాదనలు ఇచ్చింది.

04/26/2016 - 07:24

సంగారెడ్డి, ఏప్రిల్ 25: సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తమ గ్రామాలకు మహర్దశ పడుతుందని భావించిన దత్తత గ్రామాల ప్రజల ఆశలు అడియాసలే అవుతున్నాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లకుడారం గ్రామాన్ని దత్తత తీసుకోగా జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బిబి పాటిల్ ఝరాసంగం మండలం ఈదులపల్లి గ్రామాన్ని దత్తత స్వీకరించారు.

Pages