S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/11/2016 - 08:09

గజ్వేల్, ఏప్రిల్ 10: ఆరు దశాబ్దాలుగా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, వనరుల దుర్వినియోగం కొనసాగుతుండగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సైతం అదే తంతు కొనసాగుతోందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలోని పివైఅర్ గార్డెన్స్‌లో ‘దగా పడుతున్న తెలంగాణ అంశం’పై ఆదివారం జరిగిన మేథో మధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

04/11/2016 - 06:25

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణలో 17న నిర్వహించనున్న ఎస్సై పోస్టుల భర్తీ అర్హత పరీక్ష ఏర్పాట్లు పూరె్తైనట్టు రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. 17న ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. రాష్టవ్య్రాప్తంగా 525 పోస్టులకు గాను 320 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు బోర్డు తెలిపింది.

04/11/2016 - 06:18

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ చరిత్ర, ఉద్యమం, రాష్ట్రావిర్భావం, ప్రస్తుత మంత్రివర్గం తదితర అంశాలపై గుక్కతిప్పుకోకుండా సమాధానాలు చెప్పే మూడవ తరగతి చిన్నారి శ్రీలక్ష్మి శ్రీజ ప్రతిభకు సిఎం కెసిఆర్ మంత్రముగ్దుడయ్యారు. చిన్నారి ప్రతిభా పాటవాలను మెచ్చుకుంటూ భవిష్యత్‌లో మంచి చదువులు

04/11/2016 - 06:13

ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధుల సమీకరణపై సర్కారు దృష్టి పెట్టింది. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతుల రుణ మాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాల నిధుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్న ప్రభుత్వం, పనిలో పనిగా రాష్ట్రంలో నిరర్థకంగా పడివున్న భూములను అమ్మాలన్న పాత ఆలోచనకు కొత్తగా పదును పెడుతోంది.

04/11/2016 - 06:08

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులకు ఎక్కవ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తెరాస సర్కారు ఏర్పడి 22 నెలలు గడుస్తున్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి కడియం శ్రీహరిని నియమించడం వినా మంత్రివర్గంలో ఎలాంటి మార్పు చేర్పులూ చేపట్టలేదు. మరో ఏడాది వరకు కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయ.

04/10/2016 - 17:05

హైదరాబాద్:బేగంపేట విమానాశ్రయంలో నిరుపయోగంగా ఉన్న ఓ విమానాన్ని శిక్షణ విభాగానికి తరలిస్తుండగా ప్రమాదం సంభవించి అది జారి రోడ్డుపై పడింది. అయితే ఎవరికీ అపాయం కలగలేదు. ఇటీవల జరిగిన ఎయిర్‌షోలో ప్రదర్శించిన ఎ-320 రకం పాత విమానం బేగంపేట విమానాశ్రయంలో నిరుపయోగంగా ఉంది. దానిని ఓ క్రేన్ సహాయంతో తరలింస్తుండగా బరువు ఎక్కువగా ఉండటంతో జారి రోడ్డుపై పడింది.

04/10/2016 - 07:09

హైదరాబాద్, ఏప్రిల్ 9: అన్నింటిలో కలిసి పోయే గుణాలు తెలుగు భాషలో ఉన్నాయని, తెలుగు వాళ్లం కలిసే ఉంటామని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. తెలుగు భాష గొప్పదని ఆమె అన్నారు. శనివారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో మలేసియా తెలుగు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను కవిత రూపంలో వినిపించారు.

04/10/2016 - 07:06

హైదరాబాద్, ఏప్రిల్ 9: నీటి పారుదల రంగంపై ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చెప్పిన అబద్ధాలన్నింటికీ తాము ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సరైన జవాబు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

04/10/2016 - 07:05

హైదరాబాద్, ఏప్రిల్ 9: బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో శనివారం శ్రీ వెంకటేశ్వర కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఫర్ ఎపి లెజిస్లేటర్స్ లిమిటెడ్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా జి. సిద్దయ్య, కార్యదర్శిగా కె. వీరారెడ్డి, కోశాధికారిగా శ్రీగోపిరెడ్డి రంగారెడ్డి, ఎంసి సభ్యులుగా ఎం.

04/10/2016 - 07:03

డెహ్రడూన్, ఏప్రిల్ 9: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అసెంబ్లీ రికార్డులు తారుమారు చేశారని బిజెపి ఆరోపించింది. రికార్డులు తిప్పి రాయించడం లేదా తారుమారు చేసిన ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని పార్టీ డిమాండ్ చేసింది. రావత్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ ఉత్తరాఖండ్’ యాత్ర ప్రారంభించనున్నట్టు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అజయ్ భట్ వెల్లడించారు.

Pages