S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/27/2016 - 06:52

కరీంనగర్, మార్చి 26: రాష్ట్ర పురపాలక, పంచా యతీరాజ్ శాఖల మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎస్‌ఎల్ పథకం (మరుగుదొడ్ల) నిర్మాణాల్లో అవినీతి చీడ పట్టుకుంది. ఆ అక్రమాలపై జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఎట్టకేలకు కొర డా ఝుళిపించారు. బాధ్యులపై చర్యలు చేపట్టారు.

03/27/2016 - 06:52

హైదరాబాద్, మార్చి 26: ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు చల్లదనంకోసం శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వైపు మొగ్గుచూపుతారు. అయితే అనాదిగా ‘అంబలి’కి తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం అసెంబ్లీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.

03/27/2016 - 06:51

సంగారెడ్డి, మార్చి 26: మానసికంగా, శారీరకంగా కృంగి, కృశించి పోతున్న మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి కొత్త వెలుగులు ప్రసాదించడానికి మెదక్ పోలీసులు అమలు పరుస్తున్న ‘చేతన’ కార్యక్రమం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.

03/27/2016 - 06:29

భద్రాచలం, మార్చి 26: జాతీయ భద్రతా సలహాదారు, సీఆర్‌పీఎఫ్ మాజీ డీజీపీ, కిల్లర్ వీరప్పన్ ఆపరేషన్ సారథి విజయ్‌కుమార్ శనివారం దండకారణ్యంలో పర్యటించారు. తొలుత శుక్రవారం రాత్రి భద్రాచలం చేరుకున్న ఆయన స్థానిక సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపులో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ గ్రేహౌండ్స్ డీఐజీ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

03/27/2016 - 07:04

హైదరాబాద్, మార్చి 26: హెచ్‌సియు వైస్-్ఛన్సలర్ అప్పారావును రీ-కాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపిద్దామని అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం అసెంబ్లీ సమావేశంలో హెచ్‌సియు గొడవల అంశంపై పాలక-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

03/27/2016 - 06:11

బోధన్ రూరల్, మార్చి 26: నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బోధన్ మండలం సాలూరా గ్రామం వద్ద జాతీయ రహదారి పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు.

03/27/2016 - 06:09

హైదరాబాద్, మార్చి 26: విశ్వవిద్యాలయాల్లో దేశ ద్రోహ చర్యలను కఠినంగా అణిచివేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై శనివారం శాసన సభలో హోంమంత్రి ప్రకటన చేశారు.

03/27/2016 - 06:08

హైదరాబాద్, మార్చి 26: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్ యోచిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. విశ్వవిద్యాలయాలను కాషారుూకరణ చేసే దిశగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల మధ్య కేంద్రం చిచ్చుపెడుతుందని ఆయన ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు.

03/26/2016 - 18:47

హైదరాబాద్: వచ్చే నెల 23, 24 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. ఈ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నందున పరీక్షలను వాయిదా వేశారని తెలిసింది. ఆర్‌ఆర్‌బి పరీక్షల కారణంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేశామని, ప్రభుత్వంతో చర్చించి త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

03/26/2016 - 18:46

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ను పరిరక్షించేందుకు చర్యలు ప్రారంభించామని, ఇకపై గణేష్ ఉత్సవాల సందర్భంగా సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు అయిదడుగుల విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర పరిధిలో ఉన్న సుమారు 170 చెరువులను పరిరక్షించేందుకు సిఎంతో మాట్లాడి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని ఆయన శనివారం తెలిపారు.

Pages