S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/12/2016 - 13:59

హైదారాబాద్: నాచారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ కర్మాగారంలో శనివారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

03/12/2016 - 13:56

హైదరాబాద్: ఎన్టీఆర్‌ను గద్దె దింపినపుడు చంద్రబాబు తన మద్దతుదార్లతో ఎలా చేశారో తాము కూడా అలాగే చేశామని టిడిపి నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని, తెరాసలో విలీనం అయ్యామని ఆయన శనివారం విలేఖర్లతో అన్నారు. విలీనంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే స్పీకర్‌ను అడగాలని ఆయన అన్నారు.

03/12/2016 - 13:55

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ నిర్మాణంలో అయిదు ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఎల్‌బినగర్-నాగోల్, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బి నగర్-హయత్‌నగర్, తార్నాక-ఇసిఐఎల్, రాయదుర్గం- శంషాబాద్ మార్గాల్లో మెట్రోపనులు చేపడతామన్నారు.

03/12/2016 - 12:03

హైదరాబాద్: విశాఖలోని గీతం వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ అనుమానాస్పద స్థితిలో మరణించిన హైదరాబాద్ యువతి శ్రీయ మృతదేహానికి శనివారం ఉదయం వైద్యులు రీ పోస్ట్‌మార్టం జరిపారు. ఆమె విశాఖలో మరణించగా, హైదరాబాద్‌లోని అమ్ముగూడలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమార్తె మరణంపై అనేక అనుమానాలున్నందున రీ పోస్ట్‌మార్టం జరపాలని శ్రీయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

03/12/2016 - 12:01

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేందుకు చర్చ ప్రారంభమైంది.

03/12/2016 - 12:00

మెదక్: పెదశంకరం పేటలోని సంక్షేమశాఖ వసతిగృహంలో అరుణ అనే 8వ తరగతి విద్యార్థిని వార్డెన్ గదిలో ఉరివేసుకుని మరణించినట్లు శనివారం ఉదయం సిబ్బంది కనుగొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

03/12/2016 - 07:40

స్పీకర్ తీరును తప్పుపట్టిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

03/12/2016 - 07:40

60మంది విద్యార్థులకు అస్వస్థత

03/12/2016 - 07:40

అర్వపల్లి, మార్చి 11: సేద్యం చేసుకునేందుకు వేసుకున్న బోర్లు భూగర్భజల వనరులు తగ్గి ఎండిపోవడం.. రైతులు బోర్ల పక్కన బోర్లు వేసుకుంటూ పోవడంతో వివాదాలు ఏర్పడడం.. వెరసి పరస్పర కక్షల కారణంగా తండ్రీకొడుకులు హతమయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆర్వపల్లి మండలం డి.కొత్తపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేట డిఎస్పీ అబ్ధుల్ రశీద్ తెలిపిన వివరాల ప్రకారం...

03/12/2016 - 07:39

స్థాయా సంఘ సమావేశాన్ని బహిష్కరించిన జడ్పీ వైస్‌చైర్మన్, జడ్పీటిసిలు

Pages