S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/12/2016 - 07:10

నాలుగో వరుసలో రేవంత్ ఉప ప్రతిపక్షంగా ఎంఐఎం?

03/12/2016 - 05:13

539 ఉద్యోగాలకు 2 లక్షల దరఖాస్తులు పోటీలో ఎంటెక్, పిహెచ్‌డిలు సైతం..
ఏప్రిల్ 17న రాత పరీక్ష ప్రకటించిన టిఎస్‌ఎల్‌పిఆర్‌బి

03/12/2016 - 05:12

ప్రజా ప్రతినిధులకు ఆదర్శప్రాయుడు సిఎం సహా కొనియాడిన సభ్యులు
వెంకట్‌రెడ్డికి శాసనసభ ఘన నివాళి నేటికి వాయిదా

03/11/2016 - 17:55

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తమ అనుచరులతో కలిసి శుక్రవారం టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వారు మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు.

03/11/2016 - 17:48

హైదరాబాద్: ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో తమ పట్ల ప్రిన్సిపాల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న విద్యార్థినులు రోడ్డెక్కారు. మేడ్చల్ మండలం కండ్లకోయలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకునేంత వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వారు చెబుతున్నారు.

03/11/2016 - 17:37

కరీంనగర్ : పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోగల చెరువులో తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బొబ్బిలి గణేష్(9) అనే బాలుడు చెరువులో మునిగి మృతిచెందాడు. గణేష్ స్నేహితులు చెరువులో మునిగిపోతుండగా స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.

03/11/2016 - 17:35

హైదరాబాద్ : టీచర్స్ జేఏసీ నాయకులు శుక్రవారం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రతిపాదనలను వారం రోజుల్లోనే కేంద్రానికి పంపుతామని మంత్రి హామీ ఇవ్వడంతో జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

03/11/2016 - 16:57

కరీంనగర్‌ : జగిత్యాల తహసీల్దారు కార్యాలయం సామాగ్రిని కోర్టు ఆదేశాలతో ఈరోజు జప్తు చేశారు. పట్టణానికి తాగునీరు అందించేందుకు 174 మంది రైతులకు చెందిన భూములను 34 ఏళ్ల క్రితం తీసుకుని రిజర్వాయర్‌ నిర్మించారు. భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా జాప్యం చేసింది. తహసీల్దార్‌ కార్యాలయం సామాగ్రిని జప్తు చేయాలని జగిత్యాల రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింది.

03/11/2016 - 16:39

మహబూబ్‌నగర్ : అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 24కు వాయిదా పడింది. సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరావును సీఐడీ పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. కేసు వాయిదా పడటంతో వెంకటరావును ఏలూరు జైలుకు తరలించారు. అక్షయగోల్డ్‌ కేసుపైనా హైకోర్టు ఈరోజు విచారించింది. ఈనెల 24న హాజరు కావాల్సిందిగా అక్షయగోల్డ్‌ ఛైర్మన్‌ను కోర్టు ఆదేశించింది.

03/11/2016 - 16:06

హైదరాబాద్: 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు టి.అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డి అన్నారు. కేవలం అధికార దర్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, చాలాకాలంగా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను తేల్చకుండా టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమైనట్లు నిర్ణయించడం సరికాదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.

Pages