S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/10/2016 - 07:10

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగర వౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇర్కాన్ ముందుకొచ్చింది. క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇర్కాన్ సిఎండి మోహన్ తివారీ, అడిషనల్ జనరల్ మేనేజర్ దొడ్డయ్యతో పాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.

03/10/2016 - 06:11

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో తెరాసకు అఖండ విజయం చేకూర్చిన ఓటర్లకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఫలితాలు ప్రజల దీవెనలని సిఎం కెసిఆర్ అభివర్ణించారు.

03/10/2016 - 06:09

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంనుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగనుంది. ఇందులో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేస్తారు. శాసనసభలో ఈ నెల 14వ తేదీన ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెడుతారు.

03/10/2016 - 06:05

హైదరాబాద్: తెలంగాణ టిడిపికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు. టిడిపికి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇద్దరూ తమను టిఆర్‌ఎస్ శాసనసభ పక్షం సభ్యులుగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ మధుసూదనాచారికి బుధవారం అధికారికంగా లేఖ పంపించారు.

03/10/2016 - 05:55

హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా అధికార తెరాస పార్టీ తిరుగులేని ఆధిపత్య పరంపర కొనసాగిస్తోంది. మొన్నటి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, నిన్నటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికైనా, నేటి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస పార్టీ విజయదుందుభి మోగించింది. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలోనూ తెరాస ప్రభంజనమే సృష్టించింది.

03/10/2016 - 05:02

హైదరాబాద్: తెలంగాణలో వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు రెండు ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉద్యోగాల ఎంపికకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే రిక్రూట్‌మెంట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి అభ్యర్ధులను విజయవంతంగా ఎంపిక చేసింది.

03/09/2016 - 17:44

నల్గొండ: నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీలో బుధవారం జెన్‌కో ఏడీ వెంకట్ భాస్కర్‌ ఇంట్లో రూ.10 లక్షలు విలువచేసే బంగారం, రూ.60 వేల నగదును దుండగులు పట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

03/09/2016 - 17:42

వరంగల్ : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కారు జోరుగా సాగుతోంది. 36 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి మేయరు పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇతరులు 9 స్థానాలను గెల్చుకున్నారు.

03/09/2016 - 17:37

హైదరాబాద్: ఓ వివాహితను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో నిందితుడైన ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌ను బుధవారం బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని నిందితుడిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

03/09/2016 - 17:35

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తెరాసలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని వీరు స్పీకర్ మధుసూదనాచారికి ఒక లేఖ అందజేశారు.

Pages