S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2016 - 12:05

ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 34 స్థానాల్లో గెలిచి టిఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యతను సాధించింది. పది డివిజన్లలో కాంగ్రెస్, రెండేసి స్థానాల్లో సిపిఐ, సిపిఎం, వైసిపి అభ్యర్థులు గెలిచారు. టిడిపికి ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం.

03/09/2016 - 12:04

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో తెరాస అభ్యర్థులు గెలిచినందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎమ్మెల్యే బాలరాజు కెసిఆర్‌ను కలిశారు.

03/09/2016 - 12:04

ఆదిలాబాద్: గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా రబీ పంటలకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ దండెపల్లి మండలం కేంద్రంలో రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

03/09/2016 - 12:03

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

03/09/2016 - 12:01

హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలకు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పూర్తి ఆధిక్యతలో నిలిచారు. వరంగల్‌లో 58 డివిజన్లు ఉండగా, ఇప్పటివరకు తెరాస 29, కాంగ్రెస్ 3, బిజెపి 2, ఇతరులు 6 డివిజన్లలో గెలిచారు. ఖమ్మంలో 50 డివిజన్లు ఉండగా, తెరాస 34, కాంగ్రెస్ 10, సిపిఎం, సిపిఐ, వైకాపా చెరో రెండు స్థానాల్లో గెలిచారు.

03/09/2016 - 07:06

హైదరాబాద్: టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 18 కంపెనీలకు మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. 2167 కోట్ల 47లక్షల రూపాయల పెట్టుబడులతో 18 కంపెనీలను ఏర్పాటుచేయనున్నారు. వీటి ద్వారా 13,817 మందికి ఉపాధి లభిస్తుంది.

03/09/2016 - 07:05

హైదరాబాద్: మహిళల భద్రత, బాలికల సంరక్షణ కోసం ‘్భరోసా’ వెబ్‌సైట్‌ను నగర పోలీస్ కమిషనర్ కె.మహేందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను మహిళల భద్రత కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు, బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో ‘్భరోసా’ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

03/09/2016 - 07:04

హైదరాబాద్: మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బయటపెట్టాలని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

03/09/2016 - 07:03

హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతికి సంబంధించిన నివేదికను జాతీయ మానవ హక్కుల సంఘానికి పంపే విషయమై తుది నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తాము ఎటువంటి సూచనలు చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిల్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

03/09/2016 - 06:49

హైదరాబాద్: దేశంలోనే అన్ని రాష్ట్రాలను మించి మహిళలకు పెద్దపీట వేసి గౌరవించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహిళలకు అన్ని రంగాలలోను 33 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించామని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Pages