S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2016 - 06:24

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు నెత్తిన కరెంటు చార్జీల పిడుగుపడనుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు రూ.1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సదరన్ డిస్కాం, నార్తరన్ డిస్కాంలు మంగళవారం ఇక్కడ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి.

03/09/2016 - 06:23

నిజామాబాద్: పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీకి మచ్చ తెచ్చేలా ఎవరూ వ్యవహరించరాదని ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశాలలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంటే, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఓ వలస నేత ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

03/09/2016 - 06:23

దేవరకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్లగా పుట్టిన పాపానికి ఓ కన్నతల్లి 24 గంటల పాటు శిశువుకు పాలివ్వకుండా హతమార్చాలని చూసింది.

03/09/2016 - 06:21

హైదరాబాద్: ప్రభుత్వ రేషన్ సరుకులను కొనుగోలు చేస్తూ అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పేదలకు అందించే ప్రభుత్వ బియ్యాన్ని రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్ల వద్ద సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న అక్రమ వ్యాపారుల గోదాములపై మంగళవారం సివిల్ సప్లయి అధికారులతో కలసి దాడులు నిర్వహించారు.

03/09/2016 - 06:20

హైదరాబాద్: సమాజంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హోదా, సమాన వేతనం కోసం మహిళలు ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

03/09/2016 - 06:19

హైదరాబాద్: ‘ఓస్..ఇంతేనా! ఈ ఒప్పందం 2012లోనే చేశాం..’ అని శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. మహా ఒప్పందం కాదు మహా దగా..అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు.

03/09/2016 - 06:19

నేరేడుచర్ల: సభ్యసమాజం తలదించుకునేలా ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిపిన వ్యక్తికి మహిళా దినోత్సవం రోజైన మంగళవారం నిర్భయ కేసు నమోదైంది.

03/09/2016 - 06:11

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం పెట్రేగిపోయారు. రాజ్‌నంద్‌గావ్ సారడా ఎనర్జీ సంస్థ ఏజీఎం శ్రీకుమార్ నాయర్‌ను కాల్చి చంపారు. సంస్థకు చెందిన 6 వాహనాలకు నిప్పు పెట్టారు. పల్లెమాడి ఎల్‌ఓఎస్ కమిటీకి చెందిన 15 నుంచి 20 మంది సాయుధ నక్సల్స్ సంస్థలోకి చొరబడి ముందుగా ఏజీఎంను కాల్చి చంపారు.

03/09/2016 - 04:44

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నిర్వహించిన తొలి రిక్రూట్‌మెంట్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది. 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (సివిల్) పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన పరీక్ష నిర్వహించింది. లిఖిత పరీక్షలో అర్హులకు గత ఫిబ్రవరి 8 నుండి 26 వరకూ ఇంటర్వ్యూలను నిర్వహించి 904 మంది అభ్యర్ధులను ఎంపిక చేశారు.

03/09/2016 - 02:26

హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరినందున ఇక ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముంబయినుంచి హైదరాబాద్ చేరుకున్న కెసిఆర్ బృందానికి బేగంపేట విమానాశ్రయానికి తిరిగి వచ్చిన కెసిఆర్ బృందానికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

Pages