S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/08/2016 - 04:30

కొడంగల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం యానగుందిలోని మాత మాణికేశ్వరిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేటు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.

03/08/2016 - 04:28

హైదరాబాద్: మూసీకి మంచి రోజులు రానున్నాయి. మూడు వేల కోట్ల రూపాయలతో దశలవారీగా పూర్వవైభవం తీసుకురానున్నారు. మూసీపై ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఈనెల 15న దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో సమావేశమై సుందరీకరణ, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. నాబార్డ్ సహాయంతో గ్రీన్ క్లైమెట్ ఫండ్ నిధుల ద్వారా దశలవారీగా మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

03/08/2016 - 04:25

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు భారీగా 5,64,431 దరఖాస్తులు వచ్చాయి. 439 పోస్టులకుగానూ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏప్రిల్ 24న రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది.

03/08/2016 - 04:24

హైదరాబాద్: మహారాష్ట్ర సర్కార్‌తో చేసుకునే ఒప్పందం రెండు రాష్ట్రాలకు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉభయతారకంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

03/08/2016 - 04:00

భద్రాచలం: నక్సల్స్‌పై చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఇక సంయుక్తంగా పోరాటం చేయనున్నాయి. మిషన్-2016 పేరిట జాయింట్ ఆపరేషన్స్‌కు శ్రీకారం చుట్టనున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దున ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీసులతో ఇటీవల జాయింట్ ఆపరేషన్లు నిర్వహించి విజయం సాధించారు. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం, నిఘా వర్గాలతో నిరంతరం సంప్రదింపులు, ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లు..

03/07/2016 - 17:58

హైదరాబాద్: రోడ్డుపై వాహనాలను ఆపి ధ్రువపత్రాలు చూపాలంటూ హడావుడిగా తనిఖీలు చేయడం, ప్రైవేటు హాస్టళ్లలోకి వెళ్లి యాజమాన్యాలను బెదిరించడం ఆ నకిలీ ఎస్‌ఐకి అలవాటు. చివరకు నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఆ డూప్లికేటు ఎస్‌ఐ సోమవారం పోలీసులకు చిక్కాడు. ఎస్‌ఆర్ నగర్‌లో ఓ హాస్టల్‌లో ప్రవేశించిన అతను యాజమాన్యంతో పాటు అక్కడి విద్యార్థులను కూడా బెదిరించాడు.

03/07/2016 - 16:31

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని ఆర్టీసీ బస్ డిపో వద్ద సోమవారం మంటలు వ్యాపించి 50 ఆటోలు బూడిదయ్యాయి. సమీపంలోని పొలాల వద్ద లేచిన మంటలు బస్‌డిపో వద్దకు వ్యాపించాయి. రవాణాశాఖ అధికారులు తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న 50 ఆటోలను కొంతకాలంగా డిపో వద్ద ఉంచారు. మంటలు వ్యాపించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి.

03/07/2016 - 13:58

హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ఇక్కడి నుంచి ముంబయికి బయలుదేరింది. మేడిగడ్డతో పాటు 5 బ్యారేజీల నిర్మాణంపై కెసిఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మంగళవారం చర్చిస్తారు.

03/07/2016 - 11:50

హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు, కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని నీటి పారుదల మంత్రి హరీష్‌రావు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు ప్రత్యేక బృందం ఈ రోజు మహరాష్ట్ర బయల్దేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయిస్తామన్నారు.

03/07/2016 - 11:49

మహబూబ్‌నగర్: కొడంగల్ మండలం చిక్కపల్లి వద్ద సోమవారం ఉదయం ఓ కారును లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. సంఘటన స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రికి తరలించాక మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Pages