S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/07/2016 - 07:31

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి జాతర శోభ సంతరించుకుంది. తెలంగాణ అతిపెద్ధ శైవక్షేత్రమైన, దక్షిణకాశీగా ఖ్యాతి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జాతర అత్యంత వైభవంగా జరగనుంది.

03/07/2016 - 07:21

వీణవంక: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దళిత యువతిపై అత్యాచారం జరిగితే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడిని నేను పరామర్శకు వస్తే.. నా దళిత బిడ్డను దాచిపెడతారా! ఈ తతంగం ఎవరు చేయిస్తున్నారు? 5 గంటలు నిరీక్షించాలా? రాజకీయాలు చేస్తే చేసుకోండి? ప్రభుత్వం 48 గంటల్లో బాధితురాలికి న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.

03/07/2016 - 07:19

నల్లగొండ: సీఎం కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఈ దఫా వైద్య, ఆరోగ్య రంగానికి అధిక నిధులు కేటాయించనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపుర్‌లోని నిమ్స్ యూనివర్సిటీ భవనంలో అవుట్ పేషంట్ వైద్య సేవలను విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

03/07/2016 - 07:18

వరంగల్/ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కారొపరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీకి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్‌లో జరిగిన ఎన్నికలకు నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద మరింత భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్ పర్యవేక్షణలో బందోబస్తు పర్యవేక్షించారు.

03/07/2016 - 06:58

హైదరాబాద్: ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, గవర్నర్ నరసింహన్‌తో కలిసి కుతుబ్ షాహీ సమాధులను సందర్శించారు. కుతు బ్ షాహీ సమాధులను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వ ప్రతినిధులను, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఉప రాష్టప్రతి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టూరిజం సెక్రటరీ బి వెంకటేశం, మహేశ్ భగత్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పర్యటన

03/07/2016 - 06:54

హైదరాబాద్: ‘తుది శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా...నేను మరణించిన తర్వాత నా భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా ఉంచాలని కోరుకుంటున్నాను’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన ఆదివారం అనూహ్యంగా సాక్షి దినపత్రిక కార్యాలయం ముందు బైఠాయించి సుమారు గంటసేపు నిరసన ధర్నా చేశారు. దాదాపు వందమంది కార్యకర్తలు ఆయనకు మద్దతుగా బైఠాయించారు.

03/07/2016 - 02:00

హైదరాబాద్: గోదావరిపై నిర్మించే ఐదు ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10.45కు ముంబయి వెళ్తున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మంగళవారం రెండు రాష్ట్రాల సిఎంల సమక్షంలో ఒప్పందాలు కుదురుతాయి. ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్‌తో పాటు నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు సహా అధికారులు ఉంటారు.

03/07/2016 - 01:56

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీలకు ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగానే పోలింగ్ శాతం నమోదైంది. ఖమ్మంలో 67.6, వరంగల్‌లో 60.3గా పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల పోలింగ్ శాతం కన్నా మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. తెరాస తొలిసారిగా ఖమ్మంలో గట్టి పోటీ ఇచ్చింది.

03/07/2016 - 01:54

గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం

నెలాఖరుదాకా అసెంబ్లీ సమావేశాలు భగీరథకు 15 వేల కోట్ల హడ్కో రుణం
మున్సిపల్ ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లు నగరంలో లక్ష సిసి కెమెరాల ఏర్పాటు
జీవిత ఖైదీల విడుదలకు ఆమోదం మంత్రిమండలి కీలక నిర్ణయాలు

03/07/2016 - 01:35

హైదరాబాద్: ప్రైవేటు స్కూల్ టీచర్‌పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్, అతని డ్రైవర్ రమేశ్ శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నిందితులు ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. ఆదివారం వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియాముందు ప్రవేశపెట్టారు.

Pages