S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/06/2016 - 18:13

హైదరాబాద్‌ : మహిళను వేధించారన్న కేసులో ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌, డ్రైవర్‌ రమేశ్‌లను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు ఆదివారం తుర్కయాంజాల్‌లోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. అంతకుముందు వీరికి ఉస్మానియా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు జరిపించారు.

03/06/2016 - 18:01

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్ఫొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయితీలో పోలింగ్ ముగిసింది. వరంగల్ కార్ఫొరేషన్‌లో 55 నుంచి 60% మధ్యలో పోలింగ్ శాతం నమోదయ్యింది. ఖమ్మం విషయానికొస్తే 65% పోలింగ్ శాతం నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. అచ్చంపేట నగర పంచాయితీలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యింది. 75% పోలింగ్ నమోదైందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

03/06/2016 - 17:58

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఆయన్ను కేసీఆర్ కలిశారు. మార్చి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల గురించి ఆయన చర్చిస్తారని సమాచారం.

03/06/2016 - 17:46

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం రేపు ఉదయం ముంబై వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట హరీశ్‌రావు, అధికారులు వెళ్తారు. మహారాష్ట్రతో తెలంగాణ సర్కార్‌ ఒప్పందాలు చేసుకోనుంది. తెలంగాణ కేబినేట్ సమావేశంలో ఈ విషయంపై నిశితంగా చర్చించారు.

03/06/2016 - 17:42

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించి తుది రూపునిస్తారు. 10న ఉభయసభల్లో జరిగే గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలపనున్నారు. శాసనసభలో అనుసరించే వ్యూహాన్ని ఖరారుచేస్తారు.

03/06/2016 - 17:40

దిల్లీ : దిల్లీలో ఉగ్ర కదలికలపై నిఘా వర్గాలు హెచ్చరించాయి. అనుమానిత లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

03/06/2016 - 17:38

హైదరాబాద్‌: గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 15న ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక చేపట్టనున్నారు.

03/06/2016 - 05:39

నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం నూతన ఆలయం, బాల ఆలయ నిర్మాణ నమునాలకు, దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ల, ప్రతిపాదనలకు శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి సుందర్ రాజన్ రూపొందించిన ప్రధాన ఆలయం, బాల ఆలయం డిజైన్ మ్యాప్‌లను శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి సూచనల మేరకు డిజైన్ చేశారు.

03/06/2016 - 05:38

వరంగల్/ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరుగనున్న ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 6,44,098 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 3,23,165 మంది, మహిళలు 3,20,814, ఇతరులు 119 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో 398 మంది అధ్యర్ధులు పోటీ పడుతున్నారు.

03/06/2016 - 05:36

నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఎట్టకేలకు నేడు ఆదివారం ఓపి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి నిమ్స్‌లో ఓపి విభాగం సేవలను ఆదివారం ఉదయం 9-30గంటలకు ప్రారంభించనున్నారు.

Pages