S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/06/2016 - 05:35

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న ఇన్‌ఫ్లో గత మూడురోజులుగా కొనసాగుతోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు నాలుగున్న టిఎంసిలు సాగర్ జలాశయం నుండి ఆంధ్రాకు విడుదల చేయనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కుడికాల్వ ద్వారా రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 2.5 టిఎంసిల నీరు విడుదల చేస్తున్నారు.

03/06/2016 - 05:30

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ్యుడు, అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని అర్థరాత్రి సమయంలో ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ జెండాకప్పి నాయకులు నివాళులర్పించారు.

03/06/2016 - 05:16

హైదరాబాద్: మేకిన్ ఇండియా పేరిట పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నట్టుగానే వ్యవసాయ రంగం అభివృద్ధికి గ్రోయన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. ఆర్థిక సమస్యలతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి లాభసాటిగా మార్చాలని సూచించారు.

03/06/2016 - 05:15

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాలమాకుల మోడల్ స్కూల్లో శనివారం బ్రేక్ సమయంలో మెయిన్‌గేట్ వద్దకు చేరుకున్న నాగుపాము. సకాలంలో గుర్తించిన వాచ్‌మెన్ పిల్లలను బయటకు రావద్దని సూచించి, పంచాయతీ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారంతా వచ్చి పామును పట్టి తీసుకువెళ్ళారు. పెను ప్రమాదం తప్పిందని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
బ్యాంక్ డిపాజిట్ల కుంభకోణం కేసులో
ఘరానా మోసగాడి అరెస్ట్

03/06/2016 - 05:00

హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీకి ఆదివారం పోలింగ్ జరుగుతుంది. ఈ మూడింటిని కైవసం చేసుకోవడానికి తెరాస తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. వరంగల్‌లో పోటీ ఏకపక్షంగా ఉన్నా, ఖమ్మం పోటీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఖమ్మం మొదటి నుంచీ వామపక్షాలకు పట్టున్న ప్రాంతం. ఒకటిన్నర దశాబ్దాల పాటు తెదేపా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినా ఖమ్మంలో వామక్షాల పట్టు కొనసాగింది.

03/06/2016 - 04:58

హైదరాబాద్: ముఖ్యమంత్రి అధికార నివాసం, కార్యాలయం, సమావేశ మందిరాలతో కూడిన నూతన భవన సముదాయానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. నూతన భవన నిర్మాణం పూరె్తైన తరువాత సిఎం కెసిఆర్ ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. మంత్రివర్గ భేటీలు, కలెక్టర్లతో సమావేశాలు, ముఖ్య అధికారులతో జరిగే సమీక్షలు.. అన్నీంటికి ఇదే కేంద్రం కాబోతోంది. సచివాలయానికి సిఎం తక్కువగా వస్తున్నారు.

03/05/2016 - 17:40

హైదరాబాద్: భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించి పలు ఆరోపణలు రావడంతో తార్నాకలోని హైదరాబాద్ మెట్రో అభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఎసిబి అధికారులు దాడులు చేస్తున్నారు. భవనాల క్రమబద్ధీకరణ విషయమై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిని ఎలా ఆమోదించారు? అనే విషయమై వారు ఆరా తీస్తున్నారు. ఇదే విషయమై జిహెచ్‌ఎంసి కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు.

03/05/2016 - 16:08

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును ఉప్పల్‌లో పోలీసులు శనివారం రట్టు చేశారు. నిందితుల నుంచి భారీగా నకలీ వీసాలు, పాస్‌పోర్టులతో పాటు 80 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్‌గిరి ఎసిపి మీడియాకు తెలిపారు.

03/05/2016 - 16:08

హైదరాబాద్: చందానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. భర్త వేధింపుల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని మల్లీశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

03/05/2016 - 13:29

హైదరాబాద్: ఓ వివాహిత మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు ఎపి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టంలోని సెక్షన్ 345 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం పోలీసులు నిందితుడికి నోటీసులు జారీ చేశారు.

Pages