S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/05/2016 - 13:26

హైదరాబాద్: సికింద్రాబాద్ ఎస్‌డి రోడ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంజయ్‌ను దారుణంగా హత్య చేశారన్న అభియోగంపై నలుగురు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం ఉదయానే్న సంజయ్‌తో పాటు కారులో కొందరు యువకులు ప్రయాణించారని, మద్యం మత్తులో వారు సంజయ్‌తో గొడవ పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఆ గొడవ కారణంగానే ఆ యువకులు సంజయ్‌ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు.

03/05/2016 - 11:54

విశాఖ: కొంకణ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా శనివారం తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి. కోస్తా, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఎ.పి.లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

03/05/2016 - 11:53

హైదరాబాద్: ఓ వివాహిత మహిళను వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఎ.పి. మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిఆర్‌పిసి 41ఎ కింద నోటీసులు ఇవ్వడంతో సుశీల్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తారు. గురువారం నాడు తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సుశీల్ తన చేయి పట్టుకొని కారులోకి లాగేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

03/05/2016 - 11:53

ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామిరెడ్డి వెంకటరెడ్డి పార్థివదేహానికి పలువురు నేతలు శనివారం నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం పాతలింగాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎం.పి. నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వీరయ్య, కనకయ్య, సున్నం రాజయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, సిపిఐ నేత సాంబశివరావు తదితరులు చేరుకుని నివాళులర్పించారు.

03/05/2016 - 11:52

మెదక్: జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద పైపు ఊడిపోవడంతో రసాయనాలు పడి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో సికిందరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

03/05/2016 - 07:14

భద్రాచలం: చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక నక్సలైట్ మరణించగా, ముగ్గురు సిఆర్‌పిఎఫ్ కోబ్రా జవాన్లు నేలకొరిగారు. మరో 13మంది జవాన్లు గాయపడగా వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ రాజధాని రాయ్‌పూర్‌కు చికిత్స కోసం హెలీకాప్టర్ ద్వారా తరలించారు.

03/05/2016 - 07:12

హైదరాబాద్: దేశంలో కీలకమైన 46 నీటి ప్రాజెక్టులను సత్వరమే అమలు చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమన్వయ కమిటీ ఆవిర్భావానికి, భేటీకి తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవే కారణంగా నిలిచింది.

03/05/2016 - 04:58

సంగారెడ్డి: అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వచ్చే మేలోగా పూర్తి చేసి ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల గోత్రనామంతో సామూహిక గృహ ప్రవేశానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సిఎం కె చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. స్వయం శాసిత, స్వయం సంవృద్ధి, స్వయం పాలిత నినాదంతో ప్రజలంతా సమష్టిగావుంటే సాధించలేనిదంటూ ఉండదని పిలుపునిచ్చారు.

03/05/2016 - 04:41

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

03/05/2016 - 04:38

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) లక్ష 25 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నెల రోజులుగా శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై మూడు అంచలలో జరిపిన సమీక్షలు ముగియడంతో వార్షిక బడ్జెట్‌పై స్పష్టత వచ్చినట్టు అధికార వర్గాల సమాచారం.

Pages