S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/05/2016 - 04:30

హైదరాబాద్: సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో ముందనుకున్నట్టే అభివృద్ధి సాధిస్తున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత బస్సు యాత్ర జరుపుతామని, సమావేశాల సమయంలోనే నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడితే మన ఉద్యోగాలు, నిధులు, నీళ్లు మనకే వస్తాయని చెప్పాను. అదిప్పుడు రుజువవుతోందన్నారు.

03/05/2016 - 04:10

ఖమ్మం/ హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి (లింగాల) వెంకటరెడ్డి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కామేపల్లి మండలం పాత లింగాలకు చెందిన ఆయన శ్వాసకోశ వ్యాధితో గత నెల 19న హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1944 మే 22న వెంకటరెడ్డి పాత లింగాలలో నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు జన్మించారు.

03/04/2016 - 16:56

హైదరాబాద్: ఓ షాపింగ్ మాల్‌లో రెండు ఖరీదైన చేతి వాచీలను దొంగిలించినందుకు ఇద్దరు బిటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇనార్బిట్ మాల్‌కు గత నెల 9న బిటెక్ విద్యార్థులు సహస్ చౌదరి, తేజ వెళ్లారు. అక్కడ లక్షా ఇరవై వేల రూపాయలు విలువ చేసే రెండు ‘రాడో’ కంపెనీ చేతి వాచీలను వారు కాజేశారు.

03/04/2016 - 16:54

ఆదిలాబాద్: తమ బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్న 420 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించక పోవడంతో సిర్పూర్ పేపర్ మిల్లును తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు ఐడిబిఐ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రదీప్ తెలిపారు. రుణబకాయిలు చెల్లించనందున మిల్లును స్వాధీనం చేసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఈ మేరకు మిల్లు గేటుపై శుక్రవారం బ్యాంకు అధికారులు నోటీసులు అంటించారు.

03/04/2016 - 16:53

కరీంనగర్: హుజురాబాద్‌లో సుమారు రెండు వేల మంది నుంచి కోటి రూపాయల మేరకు డిపాజిట్లు వసూలు చేసిన ఏజిస్ పరివార్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ ఎండి శ్రీనివాస్ శుక్రవారం నుంచి అదృశ్యమైనట్లు బాధితులు చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా ఆవిర్భవించిన ఏజిస్ సంస్థ పలు స్కీములను ఎరగా వేసి భారీగా డిపాజిట్లు వసూలు చేసి, ఇపుడు బోర్డు తిప్పేసిందని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

03/04/2016 - 16:53

మెదక్: మెదక్ జిల్లా ఎర్రవల్లిలో మే 15 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎర్రవల్లిలో గృహనిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలో బిందుసేద్యం విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతం పచ్చదనంతో వెల్లివిరిసేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు.

03/04/2016 - 16:05

హైదరాబాద్: అనుమానాస్పదంగా మరణించిన ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీయ మృతదేహానికి రీ-పోస్టుమార్టం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని శుక్రవారం బయటికి తీశారు. అయితే, మరోసారి పోస్టుమార్టం జరపాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు శ్రీయ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

03/04/2016 - 16:04

వరంగల్: ఎన్నికల్లో తెరాసను ప్రజలు గెలిపించింది మంచి పాలన అందించడానికే తప్ప విపక్షాల గొంతు నొక్కేయడానికి కాదని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన శుక్రవారం ఇక్కడ ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, తెరాస గెలిచాక తెలంగాణ ప్రజల ఆశలను సిఎం కెసిఆర్ వమ్ము చేస్తున్నారని ఆరోపించారు.

03/04/2016 - 16:04

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)ను ట్యాంపరింగ్ చేస్తున్నారన్నది కేవలం అపోహేనని ఈసిఐఎల్ సిఎండి సుధాకర్ తెలిపారు. వీటి ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన శుక్రవారం తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో ఓటర్లలో భరోసా కల్పించేందుకు ఇవిఎంల ద్వారా రశీదులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు.

03/04/2016 - 13:03

హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థులు శుక్రవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్సీస్ కమిషన్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

Pages