S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2016 - 16:25

హైదరాబాద్: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, సబ్- ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు వయో పరిమితిని ఏడాది పెంచుతూ తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది జూలై 1 నాటికి ఎస్‌ఐ పోస్టులకు 29 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 26 ఏళ్లు నిండిన వారు అర్హులేనని ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును కూడా పెంచారు.

03/03/2016 - 14:24

ఖమ్మం: ఎన్నికల్లో అధికార తెరాస పార్టీని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలనైనా సాధించే వీలుంటుందని తెలంగాణ ఐటి,పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన గురువారం ఇక్కడ రోడ్ షోల్లో మాట్లాడుతూ, విపక్షాలకు ఓట్లు వేస్తే ఫలితం శూన్యమన్నారు. ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు.

03/03/2016 - 12:01

కరీంనగర్: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద గురువారం ఉదయం ఓ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువతి, యువకుడు మరణించారు. వీరు రామగుండం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు మనోహర్ నాయక్ ఎ.జి.బిఎస్సీ విద్యార్థి అనీ, మృతురాలు హిమబిందు మెడిసన్ విద్యార్థిని అని పోలీసులు తెలిపారు.

03/03/2016 - 12:00

ఆదిలాబాద్: మూలా నక్షత్రం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ద బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి గురువారం భక్తుల తాకిడి పెరిగింది. ఈ దివ్యమైన ముహూర్తంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు తల్లిదండ్రులు బారులు తీరి నిరీక్షిస్తున్నారు.

03/03/2016 - 11:56

సికింద్రాబాద్: ఇక్కడి ఎస్‌డి రోడ్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం సంజయ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. సంజయ్ సింగ్ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారులో వచ్చిన నలుగురు ఆగంతకులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఆగంతకులు పరారైన ఆ వాహనాన్ని మహంకాళీ పోలీసుస్టేషన్ సిబ్బంది కొద్దిసేపు వెంబడించినప్పటికీ ఫలితం దక్కలేదు.

03/03/2016 - 05:33

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలువడానికి సచివాలయానికి వచ్చిన ఓ తల్లి, కొడుకు పురుగుల మందు డబ్బాతో పట్టుబడ్డారు. సచివాలయానికి వచ్చిన వారిని ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని తనిఖీ చేయగా పురుగుల మందు డబ్బా వారి కంట పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా వారిని మహబూబ్‌నగర్‌కు చెందిన బోడెమ్మ, మల్లేష్‌గా గుర్తించారు.

03/03/2016 - 05:32

హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌డిసి) చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. నగరంలోని హుస్సేన్ సాగర్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లగ్జరీ బోట్లను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా బుధవారం ప్రారంభించారు.

03/03/2016 - 05:30

హైదరాబాద్: లోక కళ్యార్థం, విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం అష్టముఖ గండ భేరుండ లక్ష్మీనరసింహ మహాయాగం వేదమంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమైంది. 6వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత మహాయాగాన్ని వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు.

03/03/2016 - 04:43

నల్లగొండ: ప్రభుత్వాలు మారినా...సొంత రాష్ట్రం వచ్చినా జిల్లాలోని మూసీ బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల అసంపూర్తి పనులు పూర్తి కాకపోవడంతో రైతాంగం దశాబ్ద కాలంగా కాల్వల పూర్తికి ఆందోళన పర్వం సాగిస్తూనే ఉంది.

03/03/2016 - 04:42

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాలువ పరిధిలో ప్రజలకు నీటి విడుదల చేసి తాగునీటిని అందించాలని ఆయకట్టు ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు వరుస ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని కృష్ణా నది యాజమాన్య బోర్డు బుధవారం రాత్రి సాగర్ నీటి విడుదల విషయంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

Pages