S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2016 - 04:40

వీణవంక: భవిష్యత్‌లో తనకు తాను రక్షించుకోవడానికి పోలీస్ శిక్షణ పొందిన తనకు పోలీస్ ఉద్యోగమే కావాలని, తన కుటుంబ పోషణకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాతో పాటు వ్యవసాయ భూమి, ఉండడానికో ఇల్లు కట్టించాలని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలు (23) డిమాండ్ చేసింది.

03/03/2016 - 04:21

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్ఠానం భారీ బాధ్యతను మోపింది. పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే ‘చే’జారి పోకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చారు.

03/03/2016 - 04:19

హైదరాబాద్: టెక్నాలజీ, పరిపాలన, పారదర్శకత అంశాల ఆధారంగా గత రెండేళ్లగా వినూత్నమైన పద్దతుల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, పురపాలక, ఐటి శాఖల మంత్రి కె.తారకరామారావుకు స్కోచ్ సంస్థ చాలెంజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించింది. ప్రముఖ దిగ్గజాలకి అందించే స్కోచ్ అవార్డును మంత్రి కెటిఆర్ అందుకోనున్నారు. అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కూడా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును స్కోచ్ సంస్థ ప్రకటించింది.

03/03/2016 - 00:14

హైదరాబాద్: తెలంగాణ న్యాయ విద్యాకళాశాలల్లో యుజి కోర్సులో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ షెడ్యూలును కాకతీయ వర్శిటీ విడుదల చేసింది. లాసెట్ నోటిఫికేషన్ 5న వెలువడనుంది. దరఖాస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 8 నుండి మొదలవుతుంది. సాధారణ అభ్యర్ధులు 350 రూపాయిలు, ఎస్సీ, ఎస్టీలు 250 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 10లోగా సమర్పించాలి.

03/03/2016 - 00:13

హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరంతో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించబోతుంది. మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఐదు ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులపై నిర్మించబోయే ఐదు బ్యారేజీల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది.

03/02/2016 - 23:50

భద్రాచలం : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 16మందిని కాల్చి చంపేశారు. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు సైతం ధ్రువీకరించాయ. బస్తర్ ఐజీ కల్లూరి, నారాయణ్‌పూర్ ఏఎస్పీ అభిషేక్ మీనాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

03/02/2016 - 17:03

హైదరాబాద్:తెలంగాణలో 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించి లాసెట్, పీజి లాసెట్ షెడ్యూల్‌ను ఉన్నతవిద్యామండలి బుధవారంనాడు విడుదల చేసింది. ఈనెల 5న దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 8వ తేదీనుంచి అప్లికేషన్లు విక్రయం ప్రారంభించి ఏప్రిల్ 10వ తేదీతో ముగిస్తారు. ఏప్రిల్ 24న లాసెట్, పీజిలాసెట్ పరీక్ష నిర్వహిస్తారు.

03/02/2016 - 15:49

హైదరాబాద్:హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో విహారానికి రెండు ఆధునిక మరపడవలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికన్ కాటమరాన్ రకం పడవలను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జ బుధవారం ప్రారంభించారు.

03/02/2016 - 08:18

హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో రెండు వేల మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలతో కూడిన ముసాయిదా పత్రాన్ని తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచింది. పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వంద శాతం పన్ను మినహాయింపులతో పాటు ప్రోత్సాహకాలు ఉంటాయి.

03/02/2016 - 08:17

హైదరాబాద్: వేసవి ప్రారంభం కాకముందే తెలంగాణలో తీవ్ర మంచినీటి ఎద్దడి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎండలు ముదిరేసరికి ప్రజలు గక్కెడు మంచినీటి కోసం కటకటలాడే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోగా, మరోవైపు మంచినీటి అవసరాలను తీర్చే జలాశయాలు మునుపెన్నడూ లేని విధంగా ఎండిపోయాయి.

Pages