S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/29/2016 - 06:14

వీణవంక/ హుజూరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనలో ఆదివారం మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి జువైనల్‌కు తరలించారు. దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన నిందితులు ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు.

02/28/2016 - 18:02

మహబూబ్‌నగర్: బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం సాయంత్రం వేగంగా వస్తున్న ఓ కారు రోడ్డుపక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు బెంగళూరుకు చెందినవారని పోలీసులు తెలిపారు.

02/28/2016 - 18:00

హైదరాబాద్: మజ్లిస్ పార్టీకి చెందిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం ఇక్కడ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కలిశారు. మైనారిటీ విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలని, ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌లో ముస్లింలకు తగినన్ని నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తిచేశారు.

02/28/2016 - 17:59

హైదరాబాద్: దిల్లీలోని జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు నమోదైంది. ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా మాట్లాడి దేశ గౌరవానికి ఆయన భంగం కలిగించాడని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన న్యాయవాది జనార్దన గౌడ్ ఈ కేసు వేశారు. దిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు పెట్టడంతో ప్రస్తుతం కన్నయ్య తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

02/28/2016 - 18:04

కరీంనగర్: వీణవంక గ్రామంలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆయన ఆదివారం బాధితురాలితో స్వయంగా మాట్లాడి, గ్రామస్థులను శాంతింపజేశారు. తనను అడ్డుకున్న మహిళలను ఆయన సముదాయించారు.

02/28/2016 - 17:55

కరీంనగర్: వీణవంక గ్రామంలో గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ మంత్రి ఈటల రాజేందర్‌ను మహిళా సంఘాల కార్యకర్తలు ఆదివారం అడ్డుకున్నారు. దళిత యువతిపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సిఐ, ఎస్‌ఐలను తక్షణం సస్పెండ్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు.

02/28/2016 - 15:37

కరీంనగర్: వీణవంకలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న తరుణంలో మరో ఘోరం జరిగింది. కాటారం మండలం దామెరకుంట గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కాటారంలో హోం గార్డుగా పనిచేస్తున్న రాజాస్వామి కుమార్తె శనివారం నుంచి కనిపించడం లేదు.

02/28/2016 - 15:36

కరీంనగర్: వీణవంకలో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లు ఫిర్యాదు అందినా పోలీసులు బాధ్యతగా పనిచేయడం లేదని ఆరోపిసూత ఎల్కపతుర్తి గ్రామస్థులు ఆదివారం రాస్తారోకో జరిపి నిరసన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా నిజాయితీగా కేసు దర్యాప్తు చేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గితే తాము సహించేది లేదని వారు హెచ్చరించారు.

02/28/2016 - 15:26

కరీంనగర్: వీణవంక వద్ద ఓ యువతిపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో ఓ మైనర్ బాలుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కరీంనగర్‌లోని జువైనల్ హోంకి తరలించారు. ఈ ఘటనలో ఇదివరకే ఇద్దరు నిందితులు అరెస్టు చేశారు. నిందితులపై అత్యాచారం, ఎస్సీ-ఎస్సీ అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

02/28/2016 - 13:33

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంకలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో మూడో నిందితుడు రాకేష్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. ఈ కేసులో ఇప్పటికే అంజయ్య, శ్రీనివాస్ అనే యువకులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి బంధువులు దాడి చేయడంతో గాయపడిన ఈ ఇద్దరు నిందితులను వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు.

Pages