S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/28/2016 - 05:20

హైదరాబాద్: తెలంగాణ టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)ను ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 29న జారీ చేస్తామని, ఆన్‌లైన్‌లో అభ్యర్థులు ఆరోజు నుంచే నోటిఫికేషన్ ఇతర వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజు అదే రోజు నుండి మార్చి 14వరకూ చెల్లించవచ్చన్నారు. దరఖాస్తులను మార్చి 1నుండి మార్చి 15 వరకూ సమర్పించవచ్చన్నారు.

02/28/2016 - 05:18

హైదరాబాద్: రాజధాని నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కో నియోజకవర్గంలో 4740 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించగానే నగరంలో లక్ష ఇళ్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.

02/28/2016 - 05:13

హైదరాబాద్: గ్లాస్‌ఫ్రీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ఎరైస్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా గ్లాస్‌ఫ్రీ మొబైల్, ట్యాబ్స్, టెలివిజన్లను తయారు చేస్తున్న ఈ సంస్థ, తెలంగాణలో 125 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో యూనిట్ స్థాపించేందుకు అంగీకరించింది. ఎపిక్ బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులను విక్రయిస్తారు.

02/28/2016 - 05:04

కరీంనగర్/ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంకలో చోటుచేసుకున్న దళిత యువతిపై అత్యాచార ఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపుతోంది. అత్యాచారానికి పాల్పడి, ఆ దారుణాన్ని వీడియోలో చిత్రించి వేధిస్తున్న ముగ్గురు కామాంధుల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

02/27/2016 - 16:58

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ వద్ద నడిరోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన టిప్పర్ జనంపైకి దూసుకువెళ్లడమే గాక ఓ ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.

02/27/2016 - 16:48

హైదరాబాద్‌: అల్వాల్‌లో ఓ గోదాంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు చేశారు. ఈ దాడుల్లో కిరోసిన్‌ను వైట్‌గా మార్చి టిన్నర్‌గా అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

02/27/2016 - 11:55

మెదక్: సామాన్యులు మోయలేనంత భారంగా ఇంటి పన్నులు పెంచారని నిరసన వ్యక్తం చేస్తూ గజ్వేల్‌లో శనివారం టిడిపి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఇంటి పన్ను 100 రూపాయలుంటే, ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలకు పెంచడం అన్యాయమని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు తెరాస కార్యకర్తలు ప్రయత్నించడం సరికాదన్నారు.

02/27/2016 - 11:53

ఆదిలాబాద్: శ్రీరాంపూర్ ప్రాంతంలోని ఆర్.కె.6 గదిలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో నర్సయ్య అనే 55 ఏళ్ల కార్మికుడు మరణించాడు. గనిలో పని ముగించుకొని పైకి వస్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంతో అతడు మరణించాడు.

02/27/2016 - 11:52

ఆదిలాబాద్: జిన్నారం మండలం బొమ్మెన గ్రామం వద్ద శనివారం ఉదయం ఓ ప్రైవేటు స్కూలు బస్సు ఆర్టీసీ బస్సు ఢీకొనగా, ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.

02/27/2016 - 11:52

హైదరాబాద్: సినీనటి బండ జ్యోతి శనివారం గుండెపోటుతో చిత్రపురి కాలనీలోని తన నివాసంలో మరణించారు. హాస్యనటిగా, జూనియర్ ఆర్టిస్టుగా ఆమె పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Pages