S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/06/2016 - 08:06

హైదరాబాద్, జనవరి 5: హైదరాబాద్‌లోనూ కాల్‌మనీ తరహా వడ్డీ వ్యాపారం నడుస్తోంది. పాతబస్తీలో ఫైనాన్స్ సంస్థలపై దక్షిణ మండల పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న ఫైనాన్స్ సంస్థలపై దక్షిణ మండలం పోలీసులు రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం దాదాపు వంద మంది బాధితులు దక్షిణ మండల డిసిపి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

01/06/2016 - 08:06

హైదరాబాద్, జనవరి 5: గ్రేటర్ హైదరాబాద్‌లో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వపరంగా ప్రజలను ఆకట్టుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు పార్టీ పరంగా నాయకులు నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే మరోవైపు ప్రభుత్వ పరంగా వరాలు కురిపిస్తూ వాటి అమలుకు అవసరం అయిన జీవోలు విడుదల చేస్తున్నారు.

01/06/2016 - 08:01

హైదరాబాద్, జనవరి 5: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను కుదించడానికి ముందు అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోకపోవడం అనైతికమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.

01/06/2016 - 08:00

హైదరాబాద్, జనవరి 5:విడిపోతే ఏదో జరిగిపోతుందని కొందరు గగ్గోలు పెట్టారని కానీ ఇప్పుడు విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయని ఐటి శాఖ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. మాజీ మంత్రి విజయరామారావు టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ నియోజక వర్గానికి చెందిన పలువురు టిడిపి నాయకులు తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆ పార్టీలో చేరారు.

01/06/2016 - 07:59

నల్లగొండ, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంపై పలు మార్పు లు..చేర్పులు చేసి ఎట్టకేలకు తుది రూపునిచ్చారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, సలహాదారులతో చర్చించిన సిఎం కెసిఆర్ డిండి ఎత్తిపోతల పథకం నీటి సేకరణ సామర్ధ్యాన్ని 30టిఎంసిల నుండి 60టిఎంసిలకు పెంచేలా రిజర్వాయర్ల సామర్ధ్యం, ప్రధాన కాలువ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

01/06/2016 - 07:59

వరంగల్, జనవరి 5: తెలంగాణ ప్రజలే తమకు దేవుళ్లని, తప్పుచేస్తే వారే తమను శిక్షిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులో మంగళవారం కెటిపిపి రెండోదశ 600 మెగావాట్ల పవర్‌ప్లాంటును ప్రారంభించి ఆయన జాతికి అంకితం చేశారు.

01/06/2016 - 07:58

హైదరాబాద్, జనవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధైర్యం లేకే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను జాప్యం చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లు ప్రకటించిన రోజునే నోటిఫికేషన్ విడుదల చేయరాదని, రిజర్వేషన్లపై అభ్యంతరాలు తీసుకోవడానికి కనీసం 10 రోజుల గడువు ఇవ్వాలని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

01/06/2016 - 07:40

వరంగల్, జనవరి 5: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో మెడికో విద్యార్థి ఎం.ఎస్.వౌనికయాదవ్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కెఎంసి లేడిస్ హాస్టల్ రూం నంబర్ 19లో ఉంటున్న వౌనిక ఈ రోజు అనారోగ్యంగా ఉందంటూ క్లాస్‌కు వెళ్లలేదు. తోటి విద్యార్థులు క్లాస్‌కు వెళ్లి తిరిగొచ్చే వరకు డోర్ పెట్టే ఉండడంతో అనుమానం వచ్చి కిటికి తెరిచి చూడగా వౌనిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉంది.

01/06/2016 - 07:39

హైదరాబాద్, జనవరి 5: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఓటర్ల జాబితాలో నుంచి 7.9 లక్షల ఓటర్లను తొలగించినట్లు వచ్చిన అభియోగాలపై ఈ నెల 7వ తేదీన నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది.

01/06/2016 - 07:37

హైదరాబాద్, జనవరి 5: పేదల ఇళ్లంటే ఒకపుడు పిచ్చుక గూళ్లు..కానీ స్వరాష్ట్రం, స్వపరిపాలనలో సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! ఇపుడు మరో అడుగు ముందుకేసి ఎక్కువ మంది లబ్దిదారులకు ఈ ఇళ్లను అందించటంతో పాటు వారికి సౌకర్యార్దం లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

Pages