S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/02/2015 - 04:56

మహబూబ్‌నగర్, డిసెంబర్ 1: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల నుండి ఎదుర్కోంటున్న గుడుంబా రక్కసి పీడ ఎట్టకేలకు విరగడైంది. ఎక్సైజ్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో సారారహిత జిల్లాగా మహబూబ్‌నగర్ చరిత్రలోకి ఎక్కింది.

12/02/2015 - 04:53

హైదరాబాద్, డిసెంబర్ 1:ఏడువందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తెలంగాణ పోలీసు టవర్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణ పనులను ఈనెలాఖరు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భవన నిర్మాణంపై మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం అయ్యారు.

12/02/2015 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతోన్న తీరును స్వయంగా పరిశీలించి, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి త్వరలోనే జిల్లాల్లో పర్యటించబోతున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వీలైతే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లానుంచే తన పర్యటన ప్రారంభిస్తానన్నారు.

12/02/2015 - 04:45

హైదరాబాద్, డిసెంబర్ 1: బిజెపి తెలంగాణ శాఖలో ఇంత కాలం అంతర్గతంగా ఉన్న పోరు బీఫ్ ఫెస్టివల్‌తో బయటపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి, పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కోల్డ్‌వార్ కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి అనర్హుడని రాజాసింగ్ మంగళవారం చేసిన సంచలమైన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

12/01/2015 - 18:40

నల్గొండ : యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్శింహులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వైకుంఠ ద్వారం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న మోత్కుపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు.

12/01/2015 - 17:09

మెదక్ : జిల్లాలోని కోల్చారం మండలం తుక్కాపూర్‌లో అటవీ అధికారులను, గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు వలలో చిక్కింది. జనవాసాల్లో సంచరిస్తూ మంగళవారం నాడు దాదాపు తొమ్మిది మందిని గాయపరిచింది. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

12/01/2015 - 17:08

నల్గొండ : సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తమను వేధిస్తున్న ఉపాధ్యాయులపై షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా విద్యాశాఖాధికారులకు కూడా వారు ఫిర్యాదు చేశారు.

12/01/2015 - 13:44

వరంగల్ : వరంగల్‌లోని పురాతన రామప్ప ఆలయంలోని శివలింగం కుంగిపోతుంది. ఇప్పటికే సోమసూత్రం మూసుకుపోవటంతో గర్భాలయంలో నీరు నిలిచిపోతుంది. కార్తీక మాసం కావటంతో అభిషేకాలు చేయలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.

12/01/2015 - 13:43

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా కలెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. జిల్లాలోని 1510 గ్రామాలలో సారాను అరికట్టామని, మూడు నెలల్లోనే గుడుంబాను అరికట్టామని వెల్లడించారు. అలాగే కల్తీ కల్లును కూడా అరికడతామని ఆమె తెలియజేశారు.

12/01/2015 - 11:44

మెదక్: కొల్చారం మండలం తుకాపురం వద్ద మంగళవారం ఉదయం చిరుత దాడిలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన బుచ్చెమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుత సంచారం విషయమై పోలీసు, రెవిన్యూ, అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవట లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pages